బాలీవుడ్ లో ఒక్కొక్కరుగా స్టార్స్ అంతా పనిలో పడుతున్నారు. ఆలియా భట్ కూడా లాక్ డౌన్ తరువాత కొత్త ప్రాజెక్ట్ తో బిజీ అవుతోంది. ఇప్పటికే ‘గంగూభాయ్ కతియావాడి’ కంప్లీట్ చేసిన ఆమె నెక్ట్స్ ‘డార్లింగ్స్’ మూవీపై దృష్టి పెట్టింది. తన స్వంత బ్యానర్ ‘ఎటర్నల్ సన్ షైన్’ పతాకంపై తొలిసారి నిర్మాతగా మారి ‘డార్లింగ్స్’ రూపొందిస్తోంది. ఆమెతో బాటు షారుఖ్ ఖాన్ ప్రొడక్షన్ కంపెనీ ‘రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్’ కూడా సినిమా నిర్మాణంలో భాగస్వామి కానుంది.‘డార్లింగ్స్’…