Hyderabad: హైదరాబాద్‌లో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ఆత్మహత్య అంటే ఏమిటో కూడా తెలియని 6వ తరగతి బాలిక ఆత్మహత్య చేసుకుంది. అది కూడా.. 15 అంతస్తుల భవనంపై నుంచి దూకింది. అయితే.. దానికి కారణం మ్యాథ్స్ సబ్జెక్ట్. చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నల్గండ్లలోని అపర్ణ సరోవర్ అపార్ట్‌మెంట్‌లో చిన్నారి కుటుంబం నివాసం ఉంటోంది. అయితే.. తల్లిదండ్రులు చిన్నారిని ట్యూషన్‌కు పంపేవారు. ఎప్పటిలాగే ఈరోజు ట్యూషన్‌కు వెళ్లిన బాలిక 15వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అయితే.. ఆ చిన్నారిని తల్లిదండ్రులు రోజూ బలవంతంగా ట్యూషన్‌కు పంపేవారని పోలీసుల విచారణలో తెలిసింది. ఇది చిన్నారికి అస్సలు ఇష్టం లేదని పోలీసుల విచారణలో తేలింది. అంతేకాదు ఆ చిన్నారికి మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ కూడా నచ్చింది. రోజూ గణితం ట్యూషన్‌కు హాజరవ్వడం వల్లే చిన్నారి ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆత్మహత్యకు గల అసలు కారణాలను తెలుసుకునేందుకు బాలిక తల్లిదండ్రులు, ట్యూషన్ టీచర్, తోటి విద్యార్థులను విచారిస్తున్నారు. పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. కూతురు ఆత్మహత్య చేసుకుందన్న విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. తమ కూతురిని బాగా చదివించాలని కోరారు. తల్లిదండ్రుల రోదనలు చూసి అక్కడున్నవారంతా కన్నీరుమున్నీరయ్యారు. ఇంత చిన్న వయసులోనే ఆ బాలిక ఆత్మహత్య చేసుకోవడం స్థానికులందరినీ కలిచివేసింది. నిజానికి.. ఆ అమ్మాయి ఆత్మహత్య అంటే ఏమిటో కూడా సరిగ్గా తెలియని వయసులో… ఈ దారుణానికి పాల్పడడం అందరి హృదయాలను కలచివేసింది. తాజాగా తమిళ హీరో విజయ్ ఆంటోని కూతురు కూడా ఆత్మహత్య చేసుకుంది. ఇంటర్ చదువుతున్న ఆమె.. ఒత్తిడికి గురై ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే.
Kidnap Case: సికింద్రాబాద్ లో బాలుడు కిడ్నాప్ కథ సుఖాంతం.. పోలీసుల అదుపులో ఇద్దరు