Ravi Teja -Vivek : రవితేజ – వివేక్ ఆత్రేయ సినిమాకు నిర్మాతగా దిల్ రాజు పాత స్నేహితుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాస్ మహారాజా రవితేజ వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. ప్రస్తుతం శివ నిర్వాణ డైరెక్షన్ లో ఇరుముడి రిలీజ్ కు రెడీ అవుతుండగానే మరో సినిమాను సెట్స్ పైకి తీసుకువెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నాడు. టాలెంటెడ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ కాంబినేషన్లో ఒక సినిమా చేయబోతున్నాడు రవితేజ. అయితే ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కి సంబంధించి ఫిలిం నగర్ వర్గాల్లో ఒక వార్త చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుందని ఆ మధ్య వార్తలు వెలువడగా ఇప్పుడు కొన్ని అనివార్య కారణాల వల్ల మైత్రి ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది.
మైత్రీ మూవీ మేకర్స్ ప్రాజెక్ట్ నుంచి బయటకు రావడంతో ఈ సినిమా బాధ్యతలను మరొక నిర్మాత అందుకున్నట్లు సమాచారం. దిల్ రాజు నేతృత్వంలోని ‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్’ నుంచి అప్పట్లో విడిపోయిన లక్ష్మణ్ ఇప్పుడు ఈ చిత్రాన్ని నిర్మించేందుకు ముందుకు వచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. త్వరలోనే ఈ నిర్మాణ మార్పుపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని చెబుతున్నారు. మరోవైపు దర్శకుడు వివేక్ ఆత్రేయ ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులను జెట్ స్పీడ్ లో చేస్తున్నారు. వచ్చే ఏడాది ప్రారంభంలోనే ఈ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. రవితేజ ఇమేజ్‌కు తగ్గట్లుగా ఒక పవర్ఫుల్ అండ్ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ కథను రూపుదిద్దినట్లు సమాచారం. వివేక్ స్టైలిష్ టేకింగ్ కు రవితేజ మాస్ ఇమేజ్ తోడైతే బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
Also Read
- Aroopi OTT Release: తరతరాల శాపం… బొమ్మలో బంధించిన యక్షిణి.. ఓటీటీని వణికించేందుకు వస్తున్న ‘అరూపి’!
- IRUMUDI : ఇరుముడి కథ, కథనం ఏంటో చెప్పేసిన దర్శకుడు శివ నిర్వాణ
- RD Burman Biopic: రాజేష్ ఖన్నాగా అక్షయ్, మెహమూద్‌గా ఇమ్రాన్… త్వరలోనే ఆర్డీ బర్మన్ బయోపిక్ షూటింగ్
- Christopher Nolan : ఫ్రాంచైజీ లేదు.. సూపర్‌హీరో లేడు.. కానీ బిలియన్ డాలర్లు వసూలు చేసింది
తాజావార్తలు
-
Ravi Teja -Vivek : రవితేజ – వివేక్ ఆత్రేయ సినిమాకు నిర్మాతగా దిల్ రాజు పాత స్నేహితుడు
-
Aroopi OTT Release: తరతరాల శాపం… బొమ్మలో బంధించిన యక్షిణి.. ఓటీటీని వణికించేందుకు వస్తున్న ‘అరూపి’!
-
890cc V-Twin ఇంజిన్, కొత్త చాసిస్, కొత్త లుక్ తో Ducati Monster V2 లాంచ్.. ధర ఎంతంటే..?
-
Ajinkya Rahane: టీమిండియా టెస్ట్ టీమ్ కోసం మేం ముగ్గురం ఎంతో కష్టపడ్డాం!
-
Ethanol in Diesel: డీజిల్‌లో ఇథనాల్‌కు బ్రేక్.. వెనక్కి తగ్గిన కేంద్రం.. అసలు కారణం ఇదే..!
ట్రెండింగ్
-
64MP కెమెరా, 9.49 మి.మీ. మందం, AI కెమెరా ఫీచర్లతో ఆగస్టు 25న రానున్న Boltt Ace 5G..!
-
7,000mAh బ్యాటరీ, 50MP సోనీ కెమెరా, FHD+ LCD 120Hz డిస్ప్లేతో వచ్చేందుకు సిద్దమైన Moto G Max..!
-
రూ.8,499కే Lava Smart 4 లాంచ్.. మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 5000mAh బ్యాటరీ, 90Hz LCD డిస్ప్లేతో బడ్జెట్ ఫోన్..!
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!