Deccan Night Wear Store: హైదరాబాద్ లోని సికింద్రాబాద్ లోని రామ్‌గోపాల్ పేట్ లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. డెక్కన్ నైట్ వేర్ స్టోర్ లో ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి. మంటలను గుర్తించిన స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. హుటా హుటిన చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఐదో అంతస్తులో వున్న ముగ్గురిని సేఫ్ గా ప్రాణాలతో కాపాడారు. అయితే నాలుగో అంతస్తులో ఒకరు చిక్కుకున్నట్లు లైవ్ లో ఫైర్ సిబ్బంది గమనించారు. అయితే అతనిని పూర్తీగా బిల్డింగ్ పైకి రావాలని సూచించారు అగ్నిమాపక సిబ్బంది. డెక్కన్ నైట్ వేర్ స్టోర్ లో ఎవరైనా చిక్కుకున్నారా? అనేది ఇంకా తెలియాల్సింది. కాగా డెక్కన్ నైట్ వేర్ స్టోర్ లో ఒక్కసారిగా మంటలు చలరేగడంతో.. స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు.
Read also: Assistant Loco Pilot: లోకో పైలెట్ మిస్సింగ్ మిస్టరీ.. యాభై రోజులు గడుస్తున్నా దొరకని ఆచూకీ
అక్కడి నుంచి పరుగులు పెట్టారు. అక్కడే వున్న షాపులో వున్న వారిని పోలీసులు తరలించారు. అయితే షాప్ మంటలు ఎలా చెలరేగాయి అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. షాప్ వున్న వస్తులు అన్ని తగలబడటంతో భారీ నష్టం జరిగిందని షాపు యజమాని తెలిపాడు. అయితే షాప్ లో షార్ట్ షెక్యూర్ట్ వల్ల ప్రమాదం జరిగిందా? లేక మరే ఇతర కరణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో కేసు నమోదు చేసుకున్న పోసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. రామ్‌గోపాల్ పేట్ లో భారీ అగ్నిప్రమాదంతో రోడ్లన్నీ స్థంబించాయి. దట్టంగా పొగ కమ్ముకోవడంతో.. వాహనదారులు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. ట్రిఫిక్ క్లియర్ చేసే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.
Harish Rao: ట్విట్టర్, ఫేస్ బుక్ లో రిక్వెస్ట్ పెట్టండి.. కాలనీకే కంటి వెలుగు..