Hyderabad: పంజాగుట్ట శ్మశానవాటికలో షాకింగ్ ఘటన.. పూడ్చిపెట్టిన పసికందు మృతదేహం మాయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad: హైదరాబాద్లోని పంజాగుట్ట శ్మశానవాటికలో పూడ్చిపెట్టిన ఆరు నెలల పసికందు మృతదేహం అదృశ్యమైన ఘటన తీవ్ర కలకలం రేపింది. చార్మినార్ ఘాన్సీబజార్ ప్రాంతానికి చెందిన దంపతులకు ఆరు నెలల క్రితం కవల పిల్లలు జన్మించారు. అయితే తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆ పిల్లలకు బంజారాహిల్స్లోని ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. చికిత్స పొందుతూ శనివారం ఓ పసికందు మృతి చెందడంతో, కుటుంబ సభ్యులు పంజాగుట్ట హిందూ శ్మశానవాటికలో మృతదేహాన్ని ఖననం చేశారు. అనంతరం ఆదివారం రాత్రి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రెండో పసికందు కూడా పరిస్థితి విషమించి కన్నుమూసింది. సోమవారం రెండో పసికందు అంత్యక్రియలు నిర్వహించేందుకు శ్మశానవాటికకు వచ్చిన కుటుంబ సభ్యులకు ఎదురైన దృశ్యం షాక్కు గురిచేసింది. శనివారం మొదటి పసికందును పూడ్చిపెట్టిన చోట గుంత తీసి ఉండటాన్ని, గోతిలో మృతదేహం లేకపోవడాన్ని గమనించి దిగ్భ్రాంతి చెందారు. రెండో పసికందు అంత్యక్రియలు పూర్తి చేసిన అనంతరం, కుటుంబ సభ్యులు మొదటి పసికందు మృతదేహం మాయమైన వ్యవహారంపై బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. శ్మశానవాటికలోని కాటికాపరులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే ఈ సున్నితమైన ఘటనకు సంబంధించిన వివరాలను బంజారాహిల్స్ పోలీసులు ప్రస్తుతం గోప్యంగా ఉంచుతున్నారు.
Also Read
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు