వరంగల్ నగరానికి ప్రతీకగా వున్న భద్రకాళీ అమ్మవారి దేవాలయ పరిసరాలను పర్యాటకులను ఆకట్టుకునేలా తీర్చిదిద్దుతున్నట్టు పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. అందులో భాగంగానే భద్రకాళీ బండ్ ను పర్యాటకులను ఆకట్టుకునేలా తీర్చిదిద్దినట్టు తెలిపారు. అలాగే బండ్ పై జరుగుతున్న పనులనుకూడా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రులు బండ్ పై కలియ తిరిగి సందర్శకుల నుంచి కూడా అభిప్రాయాలను సేకరించారు.
బండ్ ఆధునీకరణ ఎలా వుంది? ఇంకా ఏమైనా మార్పలు చేయాలా? అన్నవిషయాలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. సందర్శకులను ఆకట్టుకోవడమే కాకుండా చారిత్రక ఆలయాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, పలువురు ప్రజా ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.