తెలంగాణ అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ విషయం తనకేమీ తెలియదని ఆమె భర్త, కాంగ్రెస్ నేత కొండా మురళి తెలిపారు. కొండా సురేఖ మంత్రి కార్యాలయానికి తాను ఒక్కసారే వెళ్లాలని, అక్కడ ఏం జరుగుతుందో తనకు తెలియదన్నారు. రేవంతన్న సీఎం కావాలని నేను, సురేఖ ఎంతో కష్టపడ్డామని.. వైఎస్ఆర్ తర్వాత మరో వైఎస్ఆర్ రేవంతన్న అని పేర్కొన్నారు. సీఎం, తమకు మధ్య ఎలాంటి విభేదాలు లేవని కొండా మురళి స్పష్టం…
కాంగ్రెస్ లో మరోసారి వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. అధిష్టానానికి ఓ మంత్రి పై కొండా మురళీ ఫిర్యాదు చేశారు. వరంగల్ జిల్లా రాజకీయాలలో ఆ మంత్రి మితిమీరిన జోక్యం, మేడారం పనుల వ్యవహారాల్లో ఆయన సొంత కంపెనీలకు ఇచ్చుకున్న టెండర్ల వ్యవహారాలపై కాంగ్రెస్ అధ్యక్షులు ఖర్గేకు మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి ఫిర్యాదు చేశారు. ఫోన్ లో మాట్లాడిన కొండా మురళీధర్‌రావు.. ప్రస్తుతం జిల్లాలో జరుగుతున్న అంశాలను సమగ్రంగా వివరించారు. Also Read:Rain Alert to Telangana…
కొండా మురళి.. సొంత పార్టీ నేతలని టార్గెట్ చేసి తీవ్ర విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. కడియం శ్రీహరి, బసవరాజు సారయ్య, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిలను పరోక్షంగా విమర్శించారు. దీంతో ఆయే నేతలు కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు చేశారు. ఈ వివాదాల నేపథ్యంలో నేడు మంత్రి కొండా సురేఖ, మురళీ కాంగ్రెస్ ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ తో భేటి అయ్యారు. తన వ్యాఖ్యలపై ఇంచార్జీ కి వివరణ ఇచ్చారు. ఇంచార్జీ మీనాక్షి నటరాజన్…
Dialogue War: వరంగల్ తూర్పు నియోజకవర్గంలో పొలిటికల్ హీట్ కొనసాగుతుంది. మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి, బీజేపీ నేత ఎర్రబెల్లి ప్రదీప్ రావు మధ్య డైలాగ్ వార్ నడుస్తుంది. ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తానన్న ప్రదీప్ రావు వ్యాఖ్యలపై కొండా మురళి తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఓరుగల్లు కాంగ్రెస్‌లో అంతర్గత పోరు... ఇప్పుడు వీధికెక్కింది. అది ఏ రేంజ్‌లో అంటే....చివరికి రాష్ట్ర నాయకత్వాన్ని కూడా సవాల్ చేసేంతలా. దీని గురించే ఇప్పుడు కాంగ్రెస్ సర్కిల్స్‌లో రకరకాల గుసగుసలు వినిపిస్తున్నాయి. పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ వచ్చిన కొత్తలో... క్రమశిక్షణ ముఖ్యం, ఉల్లంఘన ఎక్కడ జరిగినా ఉపేక్షించేది లేదంటూ... చాలా గొప్పగా చెప్పేశారు.
Konda Murali: వరంగల్ నగరంలోని వైశ్య భవన్ లో ఆర్యవైశ్య సంఘం సభ్యులు, సంఘం నాయకులు తమ డబ్బులను గోల్మాల్ చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం జరగాలంటూ సభ్యులు మాజీ ఎమ్మెల్సీ కొండా మురళిని ప్రత్యేకంగా ఆహ్వానించారు. సభ్యుల ఆహ్వానంతో కార్యక్రమానికి హాజరైన కొండా మురళి సమస్యలను పరిష్కరిస్తానని, అలాగే అనేక విషయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. Read Also:Gang Rape Case: “అంతా ప్లాన్ ప్రకారమే”.. కోల్‌కతా గ్యాంగ్ రేప్ కేసులో సంచలన…
Warangal Congress Clash: హైదరాబాద్ లోని గాంధీ భవన్ కి అనుచరులతో వచ్చిన కొండా మురళి కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ ముందు హాజరయ్యారు. ఈ సందర్భంగా క్రమశిక్షణ కమిటీకి ఆరు పేజీలతో కూడిన వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా బయటకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నన్ను కమిటి ముందుకు రండి అని ఎవరు పిలవలేదు.. పార్టీ మీద గౌరవంతో నేనే వచ్చాను అన్నారు.
Telangana Congress: ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు మళ్లీ ముదిరాయి. మంత్రి కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళిపై స్థానిక కాంగ్రెస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కొండా దంపతులు చేసిన వ్యాఖ్యలపై అసహనం వ్యక్తం చేసిన నేతలు, వారు నోరు అదుపులో పెట్టుకోవాలంటూ హెచ్చరిస్తున్నారు. కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తప్పించాలంటూ పీసీసీ ఇంఛార్జ్ మీనాక్షి నట్టరాజన్‌కు ఫిర్యాదు చేయాలని జిల్లాలో పలువురు నేతలు సన్నద్ధమవుతున్నట్లు…
వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ నేతల మధ్య వార్ ఓ రేంజ్‌లో నడుస్తోంది. ఇది ఎక్కడో మొదలైంది గానీ.. చివరికి ఎట్నుంటి ఎటు వెళ్తోందన్నది మాత్రం అంతుచిక్కడం లేదంటున్నారు పరిశీలకులు. ప్రస్తుతం అయితే.. వరంగల్ జిల్లా ప్రజా ప్రతినిధుల యుద్ధం హస్తిన దిశగా వెళ్తున్నట్టు తెలుస్తోంది. మంత్రి కొండా సురేఖ మీద తిరుగుబాటు జెండా ఎగరేశారు.. జిల్లా ఎమ్మెల్యేలు. ఈ ఆధిపత్య పోరు చాలా పెద్ద రచ్చకే దారితీస్తోందన్న అంచనాలు పెరుగుతున్నాయి.
పోలీసింగ్‌లో వరంగల్‌కు ఒక స్పెషల్ స్టేటస్ ఉంది. అలాంటి పోలీసులు ఇప్పుడు నానా ఇబ్బందులు పడుతున్నారట. బదిలీలు, సస్పెన్షన్లు, మెమోలతో హడలిపోతున్నారు. అది కూడా వరంగల్ తూర్పు నియోజకవర్గ పరిధిలోనే జరగడం ఆసక్తికరంగా మారింది.