కొండా మురళి.. సొంత పార్టీ నేతలని టార్గెట్ చేసి తీవ్ర విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. కడియం శ్రీహరి, బసవరాజు సారయ్య, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిలను పరోక్షంగా విమర్శించారు. దీంతో ఆయే నేతలు కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు చేశారు. ఈ వివాదాల నేపథ్యంలో నేడు మంత్రి కొండా సురేఖ, మురళీ కాంగ్రెస్ ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ తో భేటి అయ్యారు. తన వ్యాఖ్యలపై ఇంచార్జీ కి వివరణ ఇచ్చారు. ఇంచార్జీ మీనాక్షి నటరాజన్…
Warangal Congress Clash: హైదరాబాద్ లోని గాంధీ భవన్ కి అనుచరులతో వచ్చిన కొండా మురళి కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ ముందు హాజరయ్యారు. ఈ సందర్భంగా క్రమశిక్షణ కమిటీకి ఆరు పేజీలతో కూడిన వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా బయటకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నన్ను కమిటి ముందుకు రండి అని ఎవరు పిలవలేదు.. పార్టీ మీద గౌరవంతో నేనే వచ్చాను అన్నారు.
వరంగల్ జిల్లాకు సంబంధించిన అంశం తన దృష్టికి వచ్చిందని కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ మల్లు రవి అన్నారు. ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్‌ను అడిగి సమస్య తెలుసుకుంటానని స్పష్టం చేశారు. సమస్యను తెలుసుకొని పార్టీ లైన్ ప్రకారం ముందుకు వెళ్తామని వెల్లడించారు. వరంగల్, గజ్వెల్ రెండు ప్రాంతాల నుంచి ఫిర్యాదులు వచ్చాయన్నారు.
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ పై టీడీపీ అధిష్టానం సీరియస్ గా ఉంది. పార్టీ టికెట్ ఇవ్వడంతో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన కొలికపూడి.. తన చర్యలతో పార్టీనే ఇరకాటంలోకి నెడుతున్నారు. గతంలో సీఎం చంద్రబాబు కొలికపూడికి వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే.. దీంతో రేపు మరోసారి క్రమశిక్షణా కమిటీ ముందు హాజరుకావాలని టీడీపీ అధిష్టానం ఆదేశించింది.