పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, నిధి అగర్వాల్ హీరోయిన్‌గా, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘హరిహర వీరమల్లు’. ఈ చిత్రం పై అభిమానులు ఏ స్థాయిలో ఆశలు పెట్టుకున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఆ అంచనాలకు మేకర్స్ అనుగుణంగా స్పందించకపోవడంపై అభిమానుల్లో అసంతృప్తి పెరిగిపోతోంది.
ఇప్పటికే చాలా కాలం క్రితమే షూటింగ్ పూర్తి అయినప్పటికీ, చిత్ర బృందం నుంచి సరైన అప్డేట్స్ లేకపోవడం అభిమానులకు తీవ్ర నిరాశ కలిగిస్తోంది. ముఖ్యంగా, ఈ వారం ట్రైలర్‌కు సంబంధించి అప్డేట్ వస్తుందని ప్రకటించినప్పటికీ, అది ఇప్పటివరకు విడుదల కాలేదు. వారం ముగియబోతున్నా కూడా కనీసం ఒక టీజర్, పోస్టర్, గ్లింప్స్ లాంటి ఏదైనా చిన్న హింట్ ఇవ్వకుండా, పూర్తిగా నిశ్శబ్దంగా ఉండిపోవడం వలన ఫ్యాన్స్ నిరాశ కు లోనవుతున్నారు. దీంతొ చిత్రబృందం సోషల్ మీడియా వేదికగా కూడా ప్రమోషన్ పరంగా ఏమీ చేయకపోవడాన్ని అభిమానులు తీవ్రంగా విమర్శిస్తున్నారు.
సినిమా రిలీజ్‌ను మళ్లీ మళ్లీ వాయిదా వేయడమే కాదు, ఇప్పుడు ట్రైలర్ అప్డేట్స్ విషయంలో కూడా అజాగ్రత్తగా వ్యవహరించడం అభిమానులకు నిజమైన ‘వర్స్ట్ ఎక్స్‌పీరియన్స్’గా మారుతోంది. ఇప్పటికే సినిమా ఎన్నోసారి వాయిదా పడింది. పవన్ కళ్యాణ్ షూటింగ్ పూర్తి చేసినప్పటికీ సినిమా విడుదలపై ఇప్పటికీ స్పష్టత లేకపోవడం, దానికి తోడు తాజా ట్రైలర్ అప్డేట్ విషయంలోనూ స్పష్టత లేకుండా మేకర్స్ వ్యవహరించడం వల్ల ఫ్యాన్స్ ఆగ్రహంగా ఉన్నారు. మొత్తంగా చూస్తే, ‘హరిహర వీరమల్లు’పై ఉన్న హైప్‌ను సద్వినియోగం చేసుకోవడంలో చిత్రబృందం పూర్తిగా విఫలమైందని చెప్పాలి. ఎంత భారీ బడ్జెట్, స్టార్ కాస్ట్ ఉన్నా.. ఇలా అప్డేట్‌లు లేకుండా డిజప్పాయింట్ చేయడం అభిమానులకు నిజంగా బాధ కలిగించే విషయం.