కామాంధులు కన్నుమిన్ను ఎరగకుండా దారుణాలకు ఒడిగడుతూనే ఉన్నారు.. ఇలాంటి ఘటనలపై కేసులు నమోదు చేస్తున్నా.. కఠిన శిక్షలు అమలు చేస్తున్నా… నిత్యం ఏదో ఒక చోట మాత్రం అత్యాచార ఘటనలు వెలుగుచూస్తూనే ఉన్నాయి.. తాజాగా, ఓ దుర్మార్గుడు.. ఓ మహిళపై కన్నేశాడు.. పొలాల్లోకి లాక్కెళ్లి.. అత్యాచారం యత్నం చేశాడు.. ఇక, మహిళ గట్టిగా కేకలు వేయడంతో.. మహిళను కాపాడేందుకు వెళ్లాడు.. ఆమె భర్త.. దీంతో.. బాధితురాలి భర్తపై దాడి చేసిన నిందితుడు.. అతడిని తీవ్రంగా గాయపర్చి.. అక్కడి నుంచి పరారయ్యాడు..
Read Also: KTR: అమెరికా పర్యటనకు కేటీఆర్ టీమ్..
వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కొండాపూర్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కొండాపూర్ గ్రామానికి చెందిన శ్రీనివాస్ గ్రామశివారులో బిర్యానీ హోటల్ పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు. అదే గ్రామంలో వీఆర్‌ఏగా పనిచేస్తున్న అశోక్.. హోటల్‌కు వెళ్లి శ్రీనివాస్ భార్యను పొలాల్లోకి లాక్కెళ్లి అత్యాచారానికి యత్నించాడు. ఆమె కేకలు వేయడంతో.. అవి విన్న ఆమె భర్త శ్రీనివాస్.. అశోక్‌ను అడ్డుకునే ప్రయత్నం చేశాడు.. ఇద్దరి మధ్య తీవ్ర గొడవ జరిగింది. అదే క్రమంలో శ్రీనివాస్ చేతివేలు తెగిపడేలా కొరికిన అశోక్.. ఆ తర్వాత అక్కడి నుంచి పరారయ్యాడు. బాధితుడు తీవ్ర రక్తస్రావంతో రాయపర్తి పోలీసులను ఆశ్రయించాడు. వీఆర్‌ఏపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను వేడుకున్నారు. బాధితుని ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.. ఈ ఘటనపై మాట్లాడిన బాధితుడు శ్రీనివాస్.. కొండాపూర్గ్రామ శివారులో బిర్యానీ హోటల్ నడుపుతున్నాను.. నిన్న రాత్రి 9 గంటల సమయంలో అశోక్ అనే వ్యక్తి మా హోటల్‌కు వచ్చి నా భార్యను పొలాల్లోకి లాక్కొనిపోయాడు.. మద్యం మత్తులో నా భార్యపై అసభ్యంగా ప్రవర్తించాడు.. నేను అతని గళ్ల పట్టుకోగా నా వేలిని పూర్తిగా కొరికి పారిపోయాడు.. ఇలాంటివి పునరావృతం కాకుండా.. పోలీసులు అతడిని జైల్లో పెట్టాలని వేడుకున్నాడు.