టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ట్విట్టర్ (ఎక్స్) వేదికగా స్పందించారు. రైతు బంధుతో ఓట్లు దండుకోవాలన్న దురాశ, ఆత్రుత, అహంకారం తప్ప నిజంగా రైతులకు మేలు జరగాలన్న ఉద్దేశ్యం మామా - అల్లుళ్లకు లేదని ఆయన విమర్శలు గుప్పించారు.
Vivek: మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత వివేక్ వెంకటస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ వస్తే కరెంట్ ఉండదని సీఎం కేసీఆర్ చెబుతున్నారు, 2004లో ఉచిత కరెంట్ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదే అని ఆయన అన్నారు. సీఎంకి ఓటమి భయం పట్టుకుందని, అందుకే ఇలా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. 85 ప్లస్ ఓట్లతో కాంగ్రెస్ గెలుస్తుందని జోక్యం చెప్పారు. బీఆర్ఎస్‌ది అవినీతి ప్రభుత్వమని ఆరోపించారు.
తెలంగాణ సర్కార్ రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల 26 నుంచి రైతు బంధు నిధులు విడుదల చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. వానాకాలం పంట పెట్టుబడి కింద రైతుల ఖాతాల్లో నిధులు జమ కానున్నాయి. రాష్ట్ర రైతాంగానికి ఎప్పటిలాగే నేరుగా వారి వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేయాలని.. అందుకు చర్యలు తీసుకోవాలని ఆర్థిక శాఖామంత్రి హరీష్ రావును అదనపు ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావును సీఎం కేసీఆర్ ఆదేశించారు.
జాతీయ రాజకీయాలపై కేసీఆర్ క్లారిటీ ఇచ్చారు. దేశం కోసం ఎలా పోరాడబోతున్నానో వివరించారు. అది ఆయన మాటల్లోనే.. ‘నేను బీజేపీ, కాంగ్రెస్, చంద్రబాబు, సీపీఐ వంటి పార్టీలతో జైతెలంగాణ అనిపించలేదా. అదీ కేసీఆర్ అంటే. నేను దేశం కోసం పోరాటం మొదలుపెట్టబోతున్నా. నేను ఒకసారి ఫిక్స్ అయ్యానంటే అందరూ నాతో వస్తారు. బీజేపీని ఇప్పటికిప్పుడు టార్గెట్ చేయను. వాళ్ల తప్పులు వాళ్లే పెంచుకునే దాక చూస్తా. వాళ్లకు ఇంకా అహంకారం పెరగాలి. నేను ఎవరికీ భయపడను. ఒకరో…
తెలంగాణ రాష్ట్ర రైతన్నలు ఎదురు చూస్తున్న రైతుబంధు పంపిణీ రేపటి (జూన్ 28) నుంచే ప్రారంభానికి సర్వం సిద్దమైంది. రేపు మంగళవారం నుంచి రైతులకు పెట్టుబడి సాయం కింది రైతు బంధు నిధులు అందనున్నాయి. అయితే సీఎం కేసీఆర్ ఇప్పటికే రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్‌ను ఆదేశించిన విషయం తెలిసిందే. కాగా.. వెంటనే సీఎస్ సోమేష్ కుమార్ రైతు బంధు పంపిణీకి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అయితే…
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై నిప్పులు చెరిగారు వైఎస్సీర్టీపీ అధినేత వైఎస్ షర్మిల. యాదాద్రి జిల్లాలో ఆమె పాదయాత్ర కొనసాగుతోంది. మోత్కూర్ మాట ముచ్చటలో షర్మిల కేసీఆర్ పాలనపై నిప్పులు చెరిగారు. 46లక్షల ఇల్లు పేదలకు కట్టించి ఇచ్చింది వైఎస్ రాజశేఖర్ రెడ్డి. మోడీ పెట్రోల్ డీజిల్ గ్యాస్ పెంచుకుంటూ పోతున్నారు. కేసీఆర్ ఇచ్చేది రెండువేల పెన్షన్ మాటే కానీ దేనికి సరిపోవడంలేదు. నిత్యావసరాల ధరలు భగ్గు మనిపిస్తున్నారు. అప్పు లేని రైతు అప్పులేని కుటుంబం లేదు. తెలంగాణ…