ఉమా మహేశ్వరి భౌతిక కాయానికి మహా ప్రస్థానంలో అంత్యక్రియలు పూర్తయ్యాయి. దహన సంస్కారాలు భర్త శ్రీనివాస్ నిర్వహించారు. అంత్యక్రియలలో బాలకృష్ణ, చంద్రబాబు, లోకేష్, రామకృష్ణ, దగ్గుపాటి వెంకటేశ్వరరావు తో పాటు నందమూరి,కాంఠమనేని కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఉమామహేశ్వరి పెద్ద కుమార్తె విశాల హైదరాబాద్ చేరుకుని, విశాల కడసారిగా తన తల్లిని చూసి బోరున విలపించారు.
read also: Jyothula Chantibabu: వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు.. ఏ పార్టీలో ఎవరు శాశ్వతం…?
మాజీ సీఎం ఎన్టీఆర్ చిన్న కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి (57) సోమవారం బలవన్మరణానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఉమామహేశ్వరి అంత్యక్రియలను నేడు మహాప్రస్తానంలో నిర్వహించనున్నారు కుటుంబ సభ్యులు. అయితే.. ఉమామహేశ్వరి పెద్ద కుమార్తె విశాల అమెరికాలో ఉన్నారని, విశాల కడసారి తన తల్లిని చూసుకునేందుకే అంత్యక్రియలను ఆపినట్లు తెలిపారు. ఆమె రాగానే అంత్యక్రియల ప్రక్రియను ప్రారంభించారు.
Tamilnadu: మద్యం మత్తులో ఉడుకుతున్న సాంబారులో పడిన వ్యక్తి.. వీడియో వైరల్