మేడారం వెళ్లే సమ్మక్క, సారలమ్మ భక్తులకు గుడ్‌న్యూస్ చెప్పింది టీఎస్‌ఆర్టీసీ… ఇవాళ్టి నుంచి మేడారం ప్రత్యేకంగా బస్సు సర్వీసులను నడపనుంది ఆర్టీసీ… హన్మకొండ బస్టాండ్ నుంచి మేడారం జాతరకు ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు ఆర్టీసీ రీజినల్ మేనేజర్ విజయభాస్కర్ తెలిపారు. ఈ సర్వీసులు ప్రతీ రోజు అందుబాటులో ఉండనున్నాయి.. ఉదయం 7 గంటలకు హన్మకొండ నుంచి మేడారానికి బయల్దేరి, తిరిగి మేడారంలో సాయంత్రం 4 గంటలకు రిటర్న్ అవుతుంది.. ఇక, దీనికి చార్జీలను కూడా ఫిక్స్ చేసింది ఆర్టీసీ.. హన్మకొండ బస్టాండ్ నుంచి మేడారానికి చార్జీలు పెద్దలు రూ. 125, పిల్లలకు రూ. 65చార్జీగా నిర్ణయించినట్లు విజయభాస్కర్ వెల్లడించారు..
Read Also: తెలంగాణ మంత్రికి కరోనా