గుడ్‌న్యూస్.. ఎలక్ట్రిక్ వాహనాలకు సర్కార్ సబ్సిడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇంధనంతో నడిచే వాహనాలు కాలుష్యానికి కారణం అవుతున్నాయి.. రోజురోజుకీ పెరిగిపోతున్న వాహనాలు.. క్రమంగా పర్యావరణాన్ని దెబ్బతీస్తున్నాయి.. దీంతో, ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టిపెడుతున్నారు.. అందులో భాగంగా ఇప్పటికే రకరకాల ఎలక్ట్రిక్ వాహనాలు అందుబాటులోకి వచ్చాయి.. ఇంకా వస్తూనే ఉన్నాయి.. భవిష్యత్‌లో వాహనరంగంలో ఎలక్ట్రిక్ వాహనాలు కీలక భూమిక పోషించనున్నాయి.. ఇక, ఆ వాహనాలను కొనుగోలు చేసేవారికి శుభవార్త వినిపించింది తెలంగాణ ప్రభుత్వం.. ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీ సామర్థ్యం ఆధారంగా ప్రతి కిలో వాట్‌కు రూ.15 వేల చొప్పున సబ్సిడీని ఇవ్వనున్నట్టు వెల్లడించింది.. ఈ విషయాన్ని రాష్ట్ర పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (టీఎస్ రెడ్కో) మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.జానయ్య తెలిపారు..
Read Also: ఫిర్యాదులలో ఎయిర్టెల్ రికార్డు..! ఏంటిది..?
Also Read
- El Nino : తెలంగాణలో కరువు ముప్పు.. రెండో పంట వేయొద్దంటూ మంత్రి కీలక విజ్ఞప్తి
- Indigo : పవర్ బ్యాంక్‌లో మంటలు.. శంషాబాద్‌లో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
- Brilliance AI : విద్యార్థుల చదువుకు ఏఐ సాయం.. హైదరాబాద్‌లో కొత్త సాఫ్ట్వేర్
- Drug Network Busted : గోవా–హైదరాబాద్ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు.. ప్రధాన సూత్రధారి క్రిస్టీ అరెస్ట్
టూ వీలర్, త్రీ వీలర్, ఫోర్ వీలర్ ఇలా తేడా లేకుండా అన్ని రకాల ఎలక్ట్రిక్ వాహనాలకు ఈ సబ్సిడీ వర్తిస్తుందన్న ఆయన.. రూ.10 లక్షల విలువైన వాహనాల వరకూ ఈ సబ్సిడీ ఉంటుందని వెల్లడించారు. మరోవైపు ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించడంలో భాగంగా ఈ నెల 11, 12 తేదీల్లో హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజాలో ‘గో ఎలక్ట్రిక్’పేరుతో రోడ్ షో నిర్వహించనున్నామని తెలిపారు జానయ్య.. రూ.50 వేల నుంచి రూ.30 లక్షల విలువ చేసే అన్ని రకాల వాహనాలను ఈ రోడ్ షోలో ప్రదర్శనకు ఉంచుతామని.. 60 స్టాల్స్, చార్జింగ్ పాయింట్లు ప్రదర్శనకు ఉంటాయని వెల్లడించారు..
తాజావార్తలు
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
-
Ind Vs WI: ఆఖర్లో టీమిండియా మెరుపులు.. ముగిసిన భారత్ బ్యాటింగ్..
-
PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!