టీఆర్ఎస్ నేతలు బావిలో కప్పలా ఉన్నారని బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ఎద్దేవ చేసారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్ధంగా ఉన్నామని జెపీ నడ్డా తెలిపారని అన్నారు. నిన్నటి ప్రధాని సభ గ్రాండ్ సక్సెస్ అయిందని ఈటెల రాజేందర్ హర్షం వ్యక్తం చేసారు. బోనాలకు వచ్చినంత జనాలు రాలేదని రాష్ట్ర మంత్రులు మాట్లాడడం వారి అవివేకం అని మండిపడ్డారు. పార్టీ మీటింగ్ ని బోనాలతో పోల్చడం దుర్మార్గం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి అధికారంలోకి వస్తామని సీఎం కేసీఆర్ పగటి కలలు కంటున్నారని విమర్శించారు. బీజేపీ సమావేశాల సమయంలో ప్రజల సొమ్ముతో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటనలు ఏర్పాటు చేసి ఆనందం పొందుతున్నారని అన్నారు.
PM Modi : తెలుగువీర లేవరా.. దీక్షబూని సాగరా.. అంటూ
ఎప్పుడు ఎన్నికలు జరిగినా బీజేపీ అధికారంలోకి రావడం తధ్యమని ఈటెల హర్షం వ్యక్తం చేసారు. ప్రాంతీయ పార్టీలో.. జాతీయ పార్టీలో ఉండే తేడాను గమనించానని అన్నారు. ప్రాంతీయ పార్టీలో వ్యక్తి కేంద్రంగా నిర్ణయాలు ఉంటాయని అన్నారు. జాతీయ పార్టీలో అందరూ స్వేచ్ఛగా అభిప్రాయాలు చెప్పే అవకాశం ఉందని తెలిపారు. స్ట్రాటజీ అమలుపై సూచనలు చేశారని ఈటెల రాజేందర్ అన్నారు. యువతలో చైతన్యం నిన్న సభలో స్పష్టంగా కనిపించిందని పేర్కొన్నారు. బిజేపీ వార్తలు రాకుండా కట్టడి చేయాలని వికృత చేష్టలకు దిగారని మండిపడ్డారు. బిజేపీ పండగ వాతావరణం చెడగొట్టే ప్రయత్నం చేశారని ఆగ్రహం వ్యక్తం చేసారు. టిఆర్ఎస్ భ్రమలు ఎంతోకాలం ఉండవని అన్నారు. ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని మా పార్టీ అధిష్టానం ఆదేశించిందని ఈటెల సవాల్ విసిరారు.