Telangana Bonalu: తెలంగాణ సంస్కృతికి ప్రతీక, అత్యంత వైభవంగా నిర్వహించుకునే ఆషాడ మాస బోనాలు ఈరోజు (జూన్ 26) నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ బోనాలు జులై 24వ తేదీతో ముగుస్తాయి.
హైదరాబాద్ లో బోనాలు ప్రారంభమయ్యాయి. నేడు భాగ్యనగరంలో ఆలయాలన్నీ సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచిన మహంకాళి ఆషాఢ బోనాల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈనేపథ్యంలో.. చరిత్రాత్మక హైదరాబాద్ లాల్‌దర్వాజా సింహవాహిని మాతా మహంకాళి ఆలయంలో తెల్లవారుజామున పూజల అనంతరం బోనాల సమర్పణతో వేడుకలు ఆరంభమయ్యాయి. భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు భారీగా తరలివచ్చారు. అయితే.. గోల్కొండ కోటపై జగదాంబికా అమ్మవారికి మూడు వారాలుగా బోనాల ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. ఆషాఢ మాసం చివరి…
టీఆర్ఎస్ నేతలు బావిలో కప్పలా ఉన్నారని బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ఎద్దేవ చేసారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్ధంగా ఉన్నామని జెపీ నడ్డా తెలిపారని అన్నారు. నిన్నటి ప్రధాని సభ గ్రాండ్ సక్సెస్ అయిందని ఈటెల రాజేందర్ హర్షం వ్యక్తం చేసారు. బోనాలకు వచ్చినంత జనాలు రాలేదని రాష్ట్ర మంత్రులు మాట్లాడడం వారి అవివేకం అని మండిపడ్డారు. పార్టీ మీటింగ్ ని బోనాలతో పోల్చడం దుర్మార్గం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి అధికారంలోకి…
నగరానికి ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. నగరానికి ఆషాఢ మాసం రాకతో బోనాల సందడి మొదలవుతుంది. బోనాల ఉత్సవాలతో నగరంలో బస్తీలు, కాలనీలు కళకళలాడుతాయి. భక్తులు తమ ఇష్టదైవానికి బోనం సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు. హైదరాబాద్ లో తొలి బోనం గురువారం చారిత్రక గోల్కొండ కోటలో కొలువైన జగదాంబిక ఎల్లమ్మ అమ్మవారికి సమర్పణతో ఉత్సవాలు మొదలవుతాయి. ఇవాల్టి నుంచి వచ్చేనెల 28వ తేదీ వరకు తొమ్మిదివారాల (గురు,ఆదివారాలు)పాటు ఆషాఢమాస బోనాలను చారిత్రక గోల్కొండ జగదాంబిక ఎల్లమ్మ ఆలయంలో దేవాదాయ…