Ghaziabad Sisters S*uicide: టీనేజ్ పాలిట.. మొబైల్ గేమ్స్ డెత్ గేమ్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ghaziabad Sisters Suicide: ఆ టీనేజ్ అమ్మాయిల పాలిట.. మొబైల్ గేమ్స్ డెత్ గేమ్స్‌గా మారాయి. మొబైల్ గేమ్‌లో ఆడే… చివరి టాస్క్ వారికి లైఫ్ రిస్క్‌గా మారింది. ఉత్తర ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో జరిగిందీ ఘోరం. ముగ్గురు బంగారు భవిష్యత్తు ఉన్న అమ్మాయిలు.. ఏకంగా తమ అపార్టుమెంట్ 9వ అంతస్తు నుంచి దూకి బలవన్మరణం చెందారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది.
స్మార్ట్ ఫోన్స్.. అందులో ఉండే మొబైల్ గేమ్స్ పిల్లల ఉసురు తీస్తున్నాయి. పిల్లల్లో సూసైడ్ టెండెన్సీని ప్రేరేపిస్తున్నాయి మొబైల్ గేమ్స్. యస్.. మీరు విన్నది నిజమే..!! కొన్ని మొబైల్ గేమ్స్.. పిల్లల్లో సూసైడ్ టెండెన్సీని ప్రేరేపిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్‌లో అదే జరిగింది. ఆన్‌లైన్ గేమ్స్‌కు బానిసలైన ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ముగ్గురు 9వ అంతస్తుపై నుంచి హఠాత్తుగా దూకి సూసైడ్ చేసుకున్నారు.
Also Read
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Chhattisgarh: పెళ్లికి ‘నో’ చెప్పిందని 22 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి..
- Fraud: విదేశాల్లో ఉద్యోగాలంటూ మోసం.. నిరుద్యోగుల నుంచి రూ.50 లక్షలు వసూలు చేసిన కేటుగాడు..
- Pakistan Spy Network: నేవీ, రక్షణ సంస్థలే టార్గెట్? ఏపీలో పాక్ స్పై నెట్వర్క్ తీవ్ర కలకలం..
Ind vs SA: బౌండరీలతో ఆకాశమే హద్దుగా చెలరేగిన టీమిండియా బ్యాటర్స్! సౌతాఫ్రికాకు భారీ టార్గెట్..
ఘజియాబాద్‌లో ఆన్‌లైన్ గేమ్స్‌కు బానిసలైన ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఆత్మహత్య చేసుకోవడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ ఘటనకు కొరియన్ గేమింగ్ యాప్ కు సంబంధం ఉందని తెలుస్తోంది. ఘజియాబాద్ లోని ఓ అపార్ట్‌మెంట్లో నివసిస్తున్న ఓ కుటుంబంలో 12, 14, 16 ఏళ్ల బాలికలు ముగ్గురు ఉన్నారు. వారు తెల్లవారుజామున 2 గంటల సమయంలో అపార్ట్‌మెంట్ 9వ అంతస్తుపై నుంచి హఠాత్తుగా దూకి ఉసురు తీసుకున్నారు.
ఈ ఆత్మహత్యకు ముందు ముగ్గురు బాలికలు తమ గదిలోకి వెళ్లి బోల్ట్ పెట్టుకున్నారు. తర్వాత గది నుంచి బాల్కనీకి వచ్చి ఒకరి తర్వాత ఒకరు కిందకు దూకేశారు. వారి కేకలు, వారు నేలపై పడిన శబ్దాలతో అపార్ట్‌మెంట్ లోని సెక్యూరిటీ పరిగెత్తుకు వచ్చారు. దీంతో అపార్ట్‌మెంట్ లో ఒక్కసారిగా కలకలం రేగింది. ఆ తర్వాత వారి గదిలో సూసైడ్ లెటర్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అందులో క్షమించండి, నాన్న. నేను చాలా చాలా ఒంటరిగా ఉన్నాను.. అంటూ రాసి ఉంది.
Elon Musk: లారీ పేజ్‌ను అధిగమించి.. $800 బిలియన్లు దాటిన ఎలాన్ మస్క్ సంపద
టాస్క్-ఆధారిత కొరియన్ ఆన్‌లైన్ గేమింగ్ యాప్ ఆడుతుండడమే వారి మృతి కారణంగా ప్రాథమికంగా అంచనాకు వచ్చారు పోలీసులు. అందులో చివరి టాస్క్ సూసైడ్‌గా గుర్తించినట్లు వారి తండ్రే చెబుతున్నారు. నిజానికి ముగ్గురు అమ్మాయిలు రెండేళ్లుగా స్కూల్‌కు వెళ్లడం లేదు. ఇంట్లో ఉండడం కేవలం మొబైల్ ఫోన్‌లో ఆన్ లైన్ గేమ్స్ ఆడడమే పనిగా పెట్టుకున్నారు. పైగా కొరియన్ కల్చర్‌కు సంబంధించి కొరియన్ లవర్ అనే మొబైల్ గేమ్‌కు కూడా బాగా అలవాటుపడ్డారు. ఇప్పుడు అదే వారి ప్రాణాలు తీసింది.
ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. దీంతో ఆన్‌లైన్ గేమింగ్ అంశం మరోసారి చర్చకు దారితీసింది. పిల్లలకు స్మార్ట్ ఫోన్ ఇవ్వడం.. వారు ఏ సోషల్ మీడియాలు యూజ్ చేస్తున్నారో.. ఎలాంటి గేమ్స్ ఆడుతున్నారో తెలుసుకోకుండా తల్లిదండ్రులు ఉండడం మంచిది కాదంటున్నారు నిపుణులు. అంతే కాదు సూసైడ్ టెండెన్సీని ప్రోత్సహించే మొబైల్ గేమ్స్‌కు పిల్లలను దూరంగా ఉంచే బాధ్యత తల్లిదండ్రులదేనని చెబుతున్నారు. సో.. బీ అలర్ట్ టువర్డ్స్ యువర్ కిడ్స్.. విత్ స్మార్ట్ కిల్లింగ్ మొబైల్ ఫోన్.
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!