Jaganmohan Rao CID Investigation: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) స్కామ్‌పై తెలంగాణ నేర పరిశోధన విభాగం (సీఐడీ) విచారణ కొనసాగుతోన్న విషయం తెలిసిందే. సీఐడీ కార్యాలయంలో హెచ్‌సీఏ నిందితుల విచారణ కొనసాగుతోంది. ఐదవ రోజు ఐదుగురు నిందితులను సీఐడీ అధికారులు విచారిస్తున్నారు. ఈ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. హెచ్‌సీఏ ప్రెసిడెంట్‌గా జగన్మోహన్ రావు దొడ్డిదారిన ఎన్నికైనట్లు సీఐడీ గుర్తించింది. హెచ్‌సీఏ ఎన్నికల సమయంలో జగన్మోహన్ రావు 23 ఇన్‌స్టిట్యూషన్స్ ఓట్లను అక్రమంగా వేయించుకున్నట్లు…
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) స్కామ్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు కొనసాగిస్తోంది. సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. హెచ్ సీఏలో లో క్విడ్ ప్రో కో జరిగినట్టు ఈడి గుర్తించింది. టెండర్లు లేకుండా అనుకూలమైన వారికే పనులు కేటాయించడంతో HCA సభ్యులు భారీగా లబ్ది పొందినట్టు ఈడి గుర్తించింది. కొద్ది రోజుల క్రితమే HCA మాజీ ట్రెజరర్ సురేందర్ అగర్వాల్, అతడి భార్యను విచారించింది ఈడీ. రూ. 90 లక్షల రూపాయలు క్విడ్ ప్రో కో జరిగినట్టు…
HCA : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) ఆర్థిక అవకతవకల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితులైన ఐదుగురిని సీఐడీ అధికారులు ఈ రోజు కస్టడీలోకి తీసుకోనున్నారు. మల్కాజ్‌గిరి కోర్టు ఆరుగురికి కస్టడీ అనుమతి ఇవ్వడంతో, ఇప్పటికే చర్లపల్లి జైలులో ఉన్న నిందితులను సీఐడీ జూలై 21 వరకు అదుపులో ఉంచనుంది. కస్టడీకి అనుమతి లభించిన వారిలో హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు, సీఈవో సునీల్, ట్రెజరర్ శ్రీనివాసరావు, శ్రీచక్ర క్రికెట్…
HCA Scam: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) ఆర్థిక కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. హెచ్‌సీఏ స్కామ్‌లో అరెస్టు చేసిన నలుగురు నిందితులతో సహా అధ్యక్షుడు జగన్మోహన్ రావుకు, సీఐడీ అధికారులు కస్టడీ కోరింది. దీనితో మల్కాజ్‌గిరి కోర్టు ఆరు రోజుల కస్టడీకి అనుమతినిచ్చింది. ఇప్పటికే చర్లపల్లి జైలులో ఉన్న నిందితులను జూలై 21 వరకు సీఐడీ కస్టడీలో ఉంచేందుకు అనుమతిచ్చిన కోర్టు, విచారణ దర్యాప్తు వేగవంతం కావాలని పేర్కొంది. ఇందులో హెచ్‌సీఏ అధ్యక్షుడు…
ప్రెసిడెంట్ తో సహా మరో నలుగురు జైలుపాలయ్యారు…!! తీగ లాగితే డొంక కదిలి… అందరి బాగోతం బయటపడుతోంది..!! వందల కోట్ల అవినీతి చూసి జనాలు ఛీ కొడుతున్నారు..!! అయినా HCA తీరు మారడం లేదు. నెక్ట్స్ నేనే ప్రెసిడెంట్… నువ్వు సెక్రెటరీ… అని కొందరంటే… నీ బాగోతం కూడా బయటపెడతా… నేనే ప్రెసిడెంట్ అంటున్నాడట మరో పెద్దాయన !! అవినీతి మరకను కడిగిపారేసి.. ఇప్పటికైనా హెచ్‌సీఏలో ప్రక్షాళన చేపట్టాల్సిందిపోయి.. అవినీతి తిమింగలాల వారసులు పుట్టుకొస్తున్నారట !! హైదరాబాద్…
HCA President Jaganmohan Rao Scam: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) స్కామ్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రంగంలోకి దిగింది. హెచ్‌సీఏ స్కామ్‌పై పూర్తి వివరాలు కావాలని తెలంగాణ నేర పరిశోధన విభాగం (సీఐడీ)ను ఈడీ కోరింది. హెచ్‌సీఏలో పెద్ద మొత్తంలో ఆర్థిక లావాదేవీలు జరిగినట్లుగా అనుమానం వ్యక్తం చేసింది. హవాలా, మనీ లాండరింగ్ రూపంలో లావాదేవీలు జరిగినట్టుగా ఈడీ అనుమానిస్తోంది. హెచ్‌సీఏ కమిటీ సభ్యులు పెద్ద మొత్తంలో ఆస్తులు కూడబెట్టినట్లు గుర్తించింది. బీసీసీఐ, ఐపీఎల్ ప్రాంచైజీ…
HCA : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) అధ్యక్షుడు జగన్మోహన్‌రావుపై మల్కాజ్‌గిరి కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించిన కేసులో కీలకమైన రిమాండ్ రిపోర్ట్ ఎన్టీవీ చేతికి చేరింది. ఈ రిపోర్ట్‌లో చోటుచేసుకున్న నకిలీ పత్రాలు, ఫోర్జరీలు, నిధుల దుర్వినియోగం, పత్రాలపై సంతకాల ఫోర్జరీ లాంటి అంశాలు హచ్ఛగా వెలుగులోకి వచ్చాయి. రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో మే 2024 కంటే ముందే జరిగిన ఘటనల నేపథ్యంలో, తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గురువారెడ్డి…
వేల మంది హిందూ మహిళల మత మార్పిడి.. ఛంగూర్ బాబా నెట్వర్క్.. జలాలుద్దీన్ అలియాస్ ఛంగూర్ బాబా అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. బాబా ముసుగులో పెద్ద ఎత్తున మతమార్పిడిలు చేస్తున్న ముఠాకు కీలకంగా ఉన్నట్లు పోలీసు విచారణలో వెల్లడవుతోంది. హిందూ, సిక్కు మహిళలే లక్ష్యంగా భారీ మతమార్పిడి నెట్వర్క్‌ని ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు ఛేదించారు. యూపీలోని నేపాల్ సరిహద్దుల్లో ఉండే బలరాంపూర్ జిల్లాలోని మాధ్‌పూర్ కేంద్రంగా, విలాసవంతమైన భవనం అడ్డాగా ఛంగూర్ బాబా ఈ అరాచకాలకు…
ఎస్ఆర్హెచ్, హెచ్‌సీఏ వివాదంలో బిగ్ ట్విస్ట్ నెలకొంది. సీఐడీ హెచ్‌సీఏ ప్రెసిడెంట్‌తో పాటు బాడీని అదుపులోకి తీసుకుంది. గత ఐపీఎల్ మ్యాచుల సందర్భంగా ఎస్ఆర్‌హెచ్ హెచ్‌సీఏ మధ్య టికెట్ల వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. మ్యాచ్ సందర్భంగా టికెట్స్ కేటాయించలేదని ఆరోపిస్తూ.. కార్పొరేట్ బాక్స్ కు తాళం వేసింది హెచ్‌సీఏ. ఈ ఘటనతో హైదరాబాద్ వదిలి పోతామని ఎస్‌ఆర్‌హెచ్ యాజమాన్యం వెల్లడించింది. ఈ ఘటనపై విజిలెన్స్ ఎంక్వయిరీకి ప్రభుత్వం ఆదేశించింది.
హెచ్‌సీఏ అక్రమాలపై సంచలన విషయాలు బయటపడ్డాయి. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అక్రమాలపై విజిలెన్స్ విచారణ పూర్తయింది. ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి పంపింది. ఐపీఎల్ టికెట్ల వ్యవహారంలో విచారణ జరిగింది. హెచ్‌సీఏ సెక్రటరీ ఎస్‌ఆర్‌హెచ్ ఫ్రాంచేజ్ పై ఒత్తిడి తీసుకొని వచ్చినట్లు నిర్ధారణ అయింది.