గణేష్ ఉత్సవాల మండపాలకు ఉచిత విద్యుత్.. మంత్రి పొన్నం ప్రభాకర్!
MCRHRD లో గణేష్ ఉత్సవాలు 2025 పై హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మేయర్ గద్వాల విజయ లక్ష్మీ, డీజీపీ జితేందర్.. జీహెచ్ ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్,హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లతో పాటు హైదరాబాద్ ,మేడ్చల్ రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు ఇంకా ఇతర విభాగాల అధికారులు పాల్గొన్నారు. ఇక ఈ సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. రాష్ట్ర రాజధానిలో గణేష్ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుపుకోవాలని సూచించారు. ప్రజల సహకారంతో దేశంలో గణేష్ ఉత్సవాలు హైదరాబాద్ లో ఘనంగా జరుపుకుంటామని, అధికారులు గణేష్ ఉత్సవాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని సూచించారు. అలాగే గణేష్ ఉత్సవాల మండపాలకు ఉచిత విద్యుత్ అందించబోతున్నట్లు తెలుపుతూ, గత ఏడాది సీఎం రేవంత్ ఈ విషయంలో ఎంతో సహకరించారని గుర్తు చేశారు.
ప్రతిపక్ష ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సుదర్శన్‌రెడ్డి.. తెలంగాణ వ్యక్తి పేరు ప్రకటించిన ఖర్గే
ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎవరూ ఊహించని పేరును కాంగ్రెస్ ప్రకటించింది. తెలంగాణకు చెందిన బి.సుదర్శన్‌రెడ్డి పేరును కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ప్రకటించారు. రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేని వ్యక్తిని కాంగ్రెస్ పోటీలోకి దింపింది. ఎన్డీఏ కూటమి తమిళనాడు వ్యక్తిని ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెెట్టగా.. ఇండియా కూటమి దక్షిణాదికి చెందిన తెలంగాణ వ్యక్తిని పోటీగా దింపింది. ఇప్పుడు రాధాకృష్ణన్-సుదర్శన్‌రెడ్డి మధ్య పోటీ నెలకొంది. బి.సుదర్శన్‌రెడ్డి.. స్వస్థలం తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా ఆకుల మైలారం. వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యను అభ్యసించారు. నాలుగేళ్ల పాటు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా సేవలందించారు. ఇక రిటైర్మెంట్ తర్వాత గోవా లోకాయుక్త ఛైర్మన్‌గా పని చేశారు.
తల్లిగా ఆ విషయంలో ఆందోళన చెందుతున్న ఐశ్వర్యా రాయ్..
అందం అనగానే ప్రతి ఒక్కరికి గుర్తుకు వచ్చే పేరు ఐశ్వర్యారాయ్. తన అందంతో పాటు అద్భుతమైన వ్యక్తిత్వంతో అభిమానుల హృదయాలను గెలుచుకున్న ఈ బాలీవుడ్ నటి కేవలం హిందీలో మాత్రమే కాకుండా, భాషతో సంబంధం లేకుండా తిరుగులేని గుర్తింపు సంపాదించుకుంది. అయితే తాజాగా సోషల్ మీడియా వినియోగం పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఐశ్. ముఖ్యంగా తల్లిగా ఈ విషయంలో తనకు ఆందోళన కలుగుతుంది ఆమె స్పష్టం చేశారు. ఆమె మాట్లాడుతూ – “ప్రజలు ఇప్పుడు గుర్తింపు అంటే.. సోషల్ మీడియాలో లైక్స్, కామెంట్స్ కోసం పరుగులు పెడుతున్నారు. కానీ అవి మన విలువను నిర్ణయించలేవు. నిజమైన అందం మనలోనే ఉంటుంది. సోషల్ మీడియా, సామాజిక ఒత్తిడికి పెద్ద తేడా లేదని నేను భావిస్తాను. తల్లిగా ఇది నన్ను ఆందోళనకు గురి చేస్తోంది. వయసుతో సంబంధం లేకుండా అందరూ దీని బానిసలు అవుతున్నారు. మన ఆత్మగౌరవం కోసం సోషల్ మీడియాలో వెతకడం తప్పు.. అది అక్కడ దొరకదు. నిజమైన ప్రపంచాన్ని చూడాలంటే ఈ సోషల్ మీడియాను దాటి చూడాలి’’ అని తెలిపింది ఈ అతిలోక సుందరి. దీంతో ఆమె మాటలు విన్న నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ప్రస్తుత యువతకు అవసరమైన మెసేజ్ ఇదే అని సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇక సినీ విషయానికొస్తే ఐశ్వర్య రాయ్ చివరిసారి మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ‘పొన్నియిన్ సెల్వన్ 2’లో కనిపించారు.
కేంద్ర మంత్రులు మోదీ భజనలో బిజీగా ఉన్నారు.. సీఎం రేవంత్ సంచలనం!
తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా రాష్ట్ర బీజేపీ కేంద్ర మంత్రులపై ఫైర్ అయ్యారు. ఇక ఈ ట్వీట్ లో భాగంగా.. రాష్ట్ర రైతాంగానికి అవసరం మేరకు.. యూరియా సరఫరా చేయకుండా.. నిర్లక్ష్య, వివక్ష పూరిత వైఖరి ప్రదర్శిస్తోన్న మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరిని, మోసపూరిత వైఖరిని ఎండగడుతూ.. తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలతో గొంతు కలిపి పార్లమెంట్ వేదికగా తెలంగాణ రైతుల పక్షాన నిలిచిన శ్రీమతి ప్రియాంక గాంధీకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. పెరగనున్న శ్రీవాణి కోటా..!?
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్లే భక్తులకు మరో శుభవార్త చెప్పేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కసరత్తు ప్రారంభించినట్టుగా తెలుస్తోంది.. ఇప్పటికే శ్రీవాణి దర్శన టికెట్లు, వాటిపై దర్శనం విషయంలో కీలక మార్పులు చేసిన టీటీడీ.. ఇప్పుడు శ్రీవాణి దర్శన టిక్కెట్ల సంఖ్య పెంచే యోచనలో ఉంది.. ప్రస్తుతం జారి చేస్తున్న 1500 టిక్కెట్లను 2 వేలకు పెంచేందుకు వున్న అవకాశాలను పరిశీలిస్తున్నారు టీటీడీ ఉన్నతాధికారులు.. ప్రస్తుతం నిత్యం ఆన్ లైన్ లో 500 టిక్కెట్లు.. ఆఫ్ లైన్ లో 1000 టిక్కెట్లు జారీ చేస్తూ వస్తుంది టీటీడీ.. అయితే, ఆఫ్‌లైన్‌లో ఉన్న డిమాండ్ దృష్ట్యా.. ఆఫ్ లైన్ లో మరో 500 టిక్కెట్లు పెంపునకు వున్న అవకాశాలను పరిశీలిస్తుంది టీటీడీ.. ఆఫ్ లైన్ లో 500 టిక్కెట్లు పెంచితే. రేణిగుంట విమానాశ్రయం కోటాను 200 నుంచి 400 పెంచాలని భావిస్తున్నారట.. ఇక, ఆ తర్వాత తిరుమల కోటా 800 నుంచి 1100 పెరిగే అవకాశం ఉందని లెక్కలు వేస్తున్నారట.. అయితే, దీనిపై టీటీడీ కసరత్తు పూర్తి చేసిన తర్వాత అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశం కనిపిస్తోంది..
సుప్రీం కోర్టులో వైఎస్ వివేకా హత్య కేసు విచారణ.. ఆ కేసులు క్వాష్..
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.. జస్టిస్ ఎం ఎం సుందరేష్, ఎంకే సింగ్ ల ధర్మాసనం ఈ కేసు విచారణ చేపట్టింది.. అయితే, ఈ కేసులో తదుపరి విచారణను సెప్టెంబర్ 9వ తేదీకి వాయిదా వేసింది.. ఈ కేసులో తదుపరి సీబీఐ విచారణ అవసరమా? లేదా? అనేదానిపై సమయం కోరారు అడిషనల్ సొలిసిటర్ జనరల్ కే ఎస్ ఎన్ రాజు.. దీంతో, తదుపరి విచారణ పై అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.. కాగా, వైఎస్ వివేకా హత్య కేసులో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ తో పాటు ఇతరుల బెయిళ్లను రద్దు చేయమలని సుప్రీంకోర్టును ఆశ్రయించారు వైఎస్ సునీతా రెడ్డి… నిందితులు కేసులో సాక్ష్యాలను తారుమారు చేస్తున్నారని.. అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని వాదనలు వినిపించారు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా.. ఇక, ఈ హత్యకేసులో ప్రధాన నిందితులకు బెయిల్ ఇవ్వడాన్ని వ్యతిరేకించింది సీబీఐ.. సాక్ష్యాలను తారుమారు చేస్తున్నారని.. బెయిల్ లను రద్దు చేయాలని సుప్రీంకోర్టును కోరింది సీబీఐ.. అయితే, సునీత దంపతులపై, సీబీఐ అధికారి రాంసింగ్ పై పెట్టిన కేసును క్వాష్ చేసింది సుప్రీంకోర్టు..
కిషన్ రెడ్డి, బండి సంజయ్‌పై మహేష్ గౌడ్ ఘాటు విమర్శలు
కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి (Kishan Reddy), బండి సంజయ్ (Bandi Sanjay)పై తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ ఆయన, తెలంగాణకు రావాల్సిన యూరియా సరఫరా విషయాన్ని కేంద్రం నుంచి వెంటనే తేవాల్సిన బాధ్యత వారిదేనని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై రాజకీయ కక్షతోనే కేంద్రం యూరియాను అడ్డుకుంటోందని ఆరోపించారు. రైతులు ఎరువుల కొరతతో ఆందోళనలో ఉన్న వేళ, కిషన్ రెడ్డి ఢిల్లీలో నిద్రపోతున్నాడని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రైతుల కష్టాలను విస్మరిస్తూ, బీజేపీ నేతలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇది మంచి పద్ధతి కాదని హెచ్చరించారు. సీఎం రేవంత్ రెడ్డి, వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇప్పటికే కేంద్రానికి లేఖ రాశారని గుర్తుచేశారు. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య లోపాయికార ఒప్పందం జరిగిందని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇబ్బందిపెట్టేందుకు ఈ కుట్ర జరుగుతోందని ఆయన విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి చర్యలు సమంజసం కాదని మహేష్ గౌడ్ హితవు పలికారు.
ధర్మస్థల కేసులో ట్విస్ట్ .. మాట మార్చిన కార్మికుడు
కొన్ని నెలలుగా ధర్మస్థల సామూహిక ఖననాల కేసు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. వందలకొద్దీ శవాలను తాను పాతిపెట్టానంటూ ఓ మాజీ పారిశుద్ధ్య కార్మికుడు ఫిర్యాదు చేయడంతో ఈ కేసు నమోదైంది. దీనిపై విచారణ చేపట్టిన ప్రత్యేక దర్యాప్తు బృందం తవ్వకాలు జరిపింది. అయితే అతడు చెప్పినట్లు పెద్దగా ఆధారాలేమీ లభించలేదు. తాజాగా పారిశుద్ధ్య కార్మికుడు పూర్తిగా ప్లేట్ ఫిరాయించేశాడు. దీంతో ఈ కేసు మరో మలుపు తిరిగింది.
కర్నాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ధర్మస్థల. ఇక్కడ మంజునాథ స్వామి కొలువై ఉన్నారు. అయితే గతంలో ఇక్కడ అనేక అత్యాచారాలు, హత్యలు జరిగాయని, తానే ప్రత్యక్ష సాక్షినంటూ ఓ పారిశుద్ధ్య కార్మికుడు ఫిర్యాదు చేయడం సంచలనం కలిగించింది. ధర్మస్థల ఆలయం ఇటీవల సంచలనాత్మక ఆరోపణలకు కేంద్ర బిందువుగా మారింది. 1995 నుంచి 2014 వరకూ మంజునాథ ఆలయంలో పారిశుద్ధ్య కార్మికుడిగా పని చేసిన భీమా అనే వ్యక్తి జూన్ నెలలో పోలీసుల ముందుకొచ్చి సంచలన విషయాలు వెల్లడించాడు. తాను పని చేసిన కాలంలో వందలకొద్దీ అమ్మాయిలు, మహిళల మృతదేహాలను నేత్రావది నది ఒడ్డున పాతి పెట్టానని, వాళ్లంతా లైంగిక వేధింపులకు గురైన వారేనని వెల్లడించాడు. గతంలో ధర్మస్థలలో పలు మిస్సింగ్ కేసులు కూడా నమోదు కావడంతో అతని ఆరోపణలకు బలం చేకూరింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు.