Lok Sabha Counting: రాజకీయంగా తీవ్ర ఉత్కంఠ రేపుతున్న పార్లమెంట్ ఎన్నికల ఫలితాలకు ముహూర్తం దగ్గర పడుతోంది. మంగళవారం ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. ఉమ్మడి జిల్లాలోని నల్గొండ లోక్‌సభ స్థానానికి నల్గొండ, భువనగిరి స్థానాల కౌంటింగ్ భువనగిరిలోనే వేర్వేరుగా జరగనుంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు ప్రారంభించి అనంతరం ఈవీఎంల లెక్కింపు ప్రారంభమవుతుంది. ఒక్కో హాలులో అసెంబ్లీ నియోజకవర్గాలను లెక్కించి రౌండ్ల వారీగా ఫలితాలను ప్రకటిస్తారు. ఆయా నియోజకవర్గాల్లోని పోలింగ్ కేంద్రాల సంఖ్యను బట్టి కౌంటింగ్ రౌండ్ల సంఖ్య ఉంటుంది. ఉదయం 11 గంటల వరకు ఫలితాల సరళి ప్రకటించనుండగా, సాయంత్రం అధికారికంగా తుది ఫలితం వెలువడనుంది.
రాష్ట్రవ్యాప్తంగా ఓట్ల లెక్కింపుకు ఏర్పాట్లు ఇలా…
కరీంనగర్ లోక్ సభ స్థానం ఓట్ల లెక్కింపుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం ఓటర్లు 17,9810 కాగా.. పోలైన ఓట్లు 13,0290, పోలింగ్ శాతం 72.71% ఉన్నాయి. ఉదయం 8:00 గంటలకి కౌంటింగ్ ప్రారంభం అవుతుంది. పోస్టల్ బ్యాలెట్లు,ఈవియంలు ఒకేసారి లెక్కించాలని ఎలెక్షన్ కమిషన్ సూచించారు. పోస్టల్ బ్యాలెట్లకు ప్రత్యేక రూమ్ ఏర్పాటు చేశారు. ప్రతి నియోజకవర్గం నుండి ఐదు వివి ప్యాట్ల నుండి స్లిప్పులు లెక్కించాలని సూచించారు.
అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పోలైన ఓట్లు, కౌంటింగ్ కోసం ఏర్పాటు చేసిన టేబుళ్లు.. మొత్తం రౌండ్లు..
కరీంనగర్ ….
పోలైన ఓట్లు 2,22,296
టేబుళ్ళు..18
రౌండ్లు…22
చొప్పదండి..
పోలైన ఓట్లు.. 1,76,001
టేబుళ్ళు..14
రౌండ్లు..24.
వేములవాడ.
పోలైన ఓట్లు..1,68,373
టేబుళ్ళు…14
రౌండ్లు..19
సిరిసిల్ల..
పోలైన ఓట్లు…1,85573
టేబుళ్ళు…14
రౌండ్లు…21
మానకొండూర్..
పోలైన ఓట్లు..1,75,228
టెబుళ్ళు…14
రౌండ్లు..23
హుజురాబాద్.
పోలైన ఓట్లు..1,84,858
టేబుళ్ళు..14
రౌండ్లు..22
హుస్నాబాద్..
పోలైన ఓట్లు…1,91,361
టేబుళ్ళు..14
రౌండ్లు…22
Read More: AP Election Results 2024: అల్లర్లకు పాల్పడితే అంతే.. ఎస్పీ సీరియస్ వార్నింగ్
వరంగల్ లోకసభ స్థానం ఎన్నికల ఓట్ల లెక్కింపుకు సర్వం సిద్ధమైంది. వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో ఓట్ల లెక్కింపుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. వరంగల్ నియోజకవర్గం పరిధిలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు వారిగా లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేసిన అధికారులు. వరంగల్ తూర్పు నియోజకవర్గం 17 రౌండ్లు ఉండడంతో లెక్కింపు మొదట పూర్తి కానుంది. తొలిత పోస్టల్ బ్యాలెట్, హోం ఓటింగ్, సర్వీస్ ఓట్లను గోదాం సంఖ్య 18c లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 14 టేబుల్ పై లెక్కించనున్న అధికారులు. ఏడు సెగ్మెంట్లకు గాను మొత్తం 124 టేబుల్స్ పై 127 రౌండ్ లెక్కించనున్నారు. వరంగల్ బరిలో 42 మంది అభ్యర్థులు ఉండగా మొత్తం పోలింగ్ శాతం 68.86.. మొత్తం ఓటర్ల సంఖ్య 18, 24,466 గాను ఇంకా 12,56,31 ఓట్లు నమోదయ్యాయి.
Read More: AP Election Results: బెట్టింగ్ బాబులకు ఎగ్జిట్ పోల్స్ టెన్షన్..
7 సెగ్మెంట్ల లెక్కించాల్సిన ఓట్లు టేబుల్స్ వివరాలు.
1. స్టేషన్ ఘన్పూర్: 290 పోలింగ్ కేంద్రాలు 2,00,158 నమోదైన ఓట్లు 17 టేబుల్ 18 రెండల్లో లెక్కించనున్న అధికారులు
2. పాలకుర్తి: 294 పోలింగ్ కేంద్రాలు 1,82,515 నమోదైన ఓట్లు 17 టేబుల్లో 18 రౌండ్లో లెక్కించనున్న అధికారులు
3. పరకాల: 239 పోలింగ్ కేంద్రలు 1,70,916 నమోదైన ఓట్లు 14 టేబుల్లో 18 రౌండ్లో లెక్కించనున్న అధికారులు
4. వరంగల్ పశ్చిమ: 244 పోలింగ్ కేంద్రలు 1,49,320 నమోదైన ఓట్లు 14 టేబుల్లో 18 రౌండ్లో లెక్కించనున్న అధికారులు
5. వరంగల్ తూర్పు: 230 పోలింగ్ కేంద్రలు 1,68,234 నమోదైన ఓట్లు 14 టేబుల్లో 17 రౌండ్లో లెక్కించనున్న అధికారులు
6. వర్ధన్నపేట:278 పోలింగ్ కేంద్రలు 1,97,763 నమోదైన ఓట్లు 16 టేబుల్లో 18 రౌండ్లో లెక్కించనున్న అధికారులు
7. భూపాలపల్లి:317 పోలింగ్ కేంద్రలు 1,87,395 నమోదైన ఓట్లు 18 టేబుల్లో 18 రౌండ్లో లెక్కించనున్న అధికారులు
Read More: Kalki 2898 AD : రాంచరణ్ కూతురికి కల్కి టీం స్పెషల్ గిఫ్ట్..
మహబూబాబాద్ జిల్లోని లోక్ సభ స్థానం ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. 20 రోజులు ఉత్కంఠకు రేపటితో తెరపడనుంది. మహబూబాబాద్ లోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల కళాశాలలో జరిగే మహబూబాబాద్ లోకసభ నియోజకవర్గం ఓట్ల లెక్కింపునకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు దీని పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల వారీగా ఏర్పాట్లు చేయాల్సిన టేబుల్ లను సిద్ధం చేశారు. ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటల నుంచి ప్రారంభిస్తారు. ఒక్కో శాసనసభ నియోజకవర్గానికి 14 టేబుల్ చొప్పున మొత్తం 98 ని ఏర్పాటు చేశారు. పార్లమెంటరీ పరిధిలో ప్రతి రౌండ్ కు 98 ఈవీఎం లను లెక్కిస్తారు. మొత్తంగా 132 రౌండ్లలో ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత చివరి ఫలితం తెలుస్తుంది. అత్యధికంగా ములుగు శాసనసభ నియోజకవర్గంలో 22 ,అత్యల్పంగా భద్రాచలంలో 13 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తవుతుంది. ఏడు నియోజకవర్గాలకు కలిపి దాదాపుగా 750 మంది ఉద్యోగులు లెక్కింపులో పాల్గొననున్నారు.
Read More: Kalki 2898 AD : రాంచరణ్ కూతురికి కల్కి టీం స్పెషల్ గిఫ్ట్..
తొలత భద్రాచలం నియోజకవర్గం లో లెక్కింపు పూర్తవుతుంది చివరిగా ములుగు నియోజకవర్గ పూర్తయిన తర్వాతే విజేత ఎవరనేది తెలుస్తుంది. హోం ఓటింగ్ పోస్టల్ బ్యాలెట్ లను లెక్కించేందుకు ప్రత్యేక గదిని ఏర్పాటు చేస్తున్నారు ఈ ఓట్ల లెక్కింపు 12 టేబుల్ లపై ఏఆర్ఓ సమక్షంలో నిర్వహిస్తారు. ఈవీఎంలలో ఓటు లెక్కింపు పూర్తయిన తర్వాత వీవీ ప్యాడ్లలోనే స్లిప్ లను లెక్కిస్తారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు మూడు అంచల భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. పోలీసులు కేంద్ర బలగాలకు సంబంధించిన 600 మంది అధికారులు సిబ్బంది విధులు నిర్వహించనున్నారు. లెక్కింపు నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నారు. మహబూబాబాద్ నుంచి ఈదులపూసపల్లి మీదుగా కేసముద్రం,గూడూరు, వెళ్లే ప్రయాణికులు రామచంద్రపురం కాలనీ గుండా ఎస్వీ విద్యాలయం పక్క నుంచి వెళ్లేలా ట్రాఫిక్ ను మళ్లిస్తున్నారు.
Read More: Super Over: టీ20 ప్రపంచకప్‌లో నరాలు తెగే ఉత్కంఠ.. సూపర్ ఓవర్‌లో నమీబియా విజయం!
ఖమ్మం పార్లమెంటు ఎన్నికకు సంబందించిన కౌంటింగ్ ఏర్పాట్లను అన్ని పూర్తిచేసినట్లుగా జిల్లా కలెక్టర్, రిటర్నింగ్ అధికారి గౌతమ్ చెప్పారు. పార్లమెంటు పరిదిలో ఉన్న ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల కు ప్రత్యేకంగా కౌంటింగ్ కేంద్రాలు అదే విదంగా పోస్టల్ బ్యాలెట్ కోసం ఒక్క కౌంటింగ్ కేంద్రాన్ని మొత్తం ఎనిమిది రూమ్ లలో కౌంటింగ్ కొనసాగుతుందని చెప్పారు. ఖమ్మం అసెంబ్లీ పరిదిలో అత్యదికంగా ఓట్లు ఉన్నందున ఖమ్మం కౌంటింగ్ కేంద్రంలో 18 టేబుళ్లు , అదేవిదంగ తక్కువ ఓగట్లు ఉన్న అశ్వరావు పేట 14 టేబుల్లను ఏర్పాటు చేసినట్లుగా చెబుతున్న జిల్లా రిటర్నింగ్ అధికారి గౌతమ్ తెలిపారు.
Read More: Heavy Rains: అనంతపురం జిల్లాలో భారీ వర్షం.. రాయదుర్గం-బళ్లారి రాకపోకలకు బ్రేక్..
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లోక్ సభ ఓట్ల లెక్కింపుకి ఏర్పాట్లు చేస్తున్న అధికారులు. రుద్రారంలోని గీతం యూనివర్సిటీలో ఏడు నియోజకవర్గాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. జహీరాబాద్ పార్లమెంట్ నుంచి బరిలో 19 మంది అభ్యర్థులు కాగా.. మొత్తం 16 లక్షల 41 వేల 410 ఓట్లకు గాను పోలైన 12 లక్షల 25 వేల 49 ఓట్లు ఉన్నాయి. ఓట్ల లెక్కింపు కోసం ప్రతి నియోజకవర్గానికి 14 టేబుళ్ల చొప్పున మొత్తం 98 టేబుళ్లు ఏర్పాటు చేశారు. అత్యధికంగా ఆందోల్, జహీరాబాద్ సెగ్మెంట్ కి 23 రౌండ్లు, నారాయణఖేడ్ 22, బాన్సువాడ, ఎల్లారెడ్డి 20, జుక్కల్, కామారెడ్డి 19 రౌండ్లలో పూర్తి ఫలితాలు వెల్లడి కానున్నాయి. ముందుగా పోలైన 10 వేల 832 పోస్టల్ బ్యాలెట్ ఓట్లను 14 టేబుళ్లపై ఒకే రౌండ్ లో లెక్కింపు చేయన్నారు.
Read More: Suriya 44 : సూర్య ఫస్ట్ షాట్ అదిరిపోయిందిగా..
మెదక్ లోక్ సభ ఓట్ల లెక్కింపుకి అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు. మొత్తం 18 లక్షల 28 వేల 210 ఓట్లకు గాను పోలైన 13 లక్షల 72 వేల 894 ఓట్లు కాగా.. మెదక్ నుంచి 44 మంది అభ్యర్థులు బరిలో వున్నారు. రెండు చోట్ల మెదక్ పార్లమెంట్ ఓట్ల లెక్కింపు జరగనుంది. నర్సాపూర్ అల్లూరి గురుకులంలో సంగారెడ్డి, పటాన్ చెరు నియోజకవర్గ ఓట్ల లెక్కింపు కార్యక్రమం నిర్వహించనున్నారు. BVRIT ఇంజనీరింగ్ కాలేజీలో మెదక్, నర్సాపూర్, దుబ్బాక, గజ్వేల్, సిద్దిపేట నియోజకవర్గ ఓట్ల లెక్కించనున్నారు.
Read More:Top Headlines @ 9 AM : టాప్ న్యూస్
అత్యధికంగా పటాన్ చెరు సెగ్మెంట్ కి 18 టేబుళ్లు, గజ్వేల్ కి 15, మిగిలిన ఐదు నియోజకవర్గాలకు 14 చొప్పున మొత్తం 103 టేబుళ్లు ఏర్పాటు చేశారు. పటాన్ చెరు ఫలితం 23 రౌండ్లు, నర్సాపూర్, గజ్వేల్ 22, సంగారెడ్డి 21, మెదక్, సిద్దిపేట 20, దుబ్బాక 19 మొత్తం 147 రౌండ్లలో పూర్తి ఫలితాలు రానున్నాయి. ముందుగా పోలైన 14, 297 పోస్టల్ బ్యాలెట్ ఓట్లను రెండు రౌండ్లలో లెక్కించనున్న అధికారులు. 199 సీసీ కెమెరాలతో నిరంతరం పర్యవేక్షణలో ఉండనున్నాయి. 10 మంది డీఎస్పీలు, 15 మంది సీఐలు, 45 మంది ఎస్సైలతో మొత్తం 650 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు.
V. Hanumantha Rao: గతంలో కూడా ఎగ్జిట్ పోల్స్ వ్యతిరేకంగా వచ్చాయి..