Suriya 44 : కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘కంగువ’..స్టార్ డైరెక్టర్ శివ తెరకెక్కిస్తున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాను స్టూడియో గ్రీన్ అండ్ యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ పై జ్ఞానవేల్ రాజా , వంశికృష్ణ రెడ్డి మరియు ప్రమోద్ ఉప్పలపాటి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సూర్య సరసన బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని హీరోయిన్ గా నటిస్తుంది.అలాగే యానిమల్ మూవీ ఫేమ్ బాబీ డియోల్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నారు.ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తికాగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది.అయితే కంగువ మూవీ రిలీజ్ డేట్ ఇంకా ఫిక్స్ అవ్వలేదు.
Read Also :Kalki 2898 AD : ప్రభాస్ ‘కల్కి’ అడ్వాన్స్ బుకింగ్ డేట్ ఫిక్స్..?
తాజాగా సూర్య మరో సినిమా షూటింగ్ ను కూడా మొదలుపెట్టేశారు.సూర్య తన తరువాత సినిమాను తమిళ స్టార్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో చేస్తున్నాడు. ఈ చిత్రం సూర్య కెరీర్ లో 44 వ చిత్రంగా తెరకెక్కుతుంది..ఈ సినిమా షూటింగ్ జూన్ 2 న గ్రాండ్ గా మొదలైంది.సూర్య 44 నుంచి ఫస్ట్ షాట్ వీడియోను తాజాగా చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఈ వీడియోలో సూర్య లుక్ ఎంతో డిఫరెంట్‍గా ఉంది. లాంగ్ హెయిర్ తో కనిపిస్తున్న సూర్య లుక్ అదిరిపోయింది
సూర్య సరికొత్త లుక్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.ఈ చిత్రం ఫస్ట్ షాట్ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఈ మూవీ షూటింగ్ అండమాన్ నికోబార్‌లోని పోర్ట్ బ్లైర్‌లో షూటింగ్ మొదలైంది.ఇదిలా ఉంటే ఈ సినిమాలో హీరోయిన్ గా పూజ హెగ్డే నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.
Lights! Camera!! Action!!!#Suriya44FirstShot#LoveLaughterWar ❤️🔥 #AKarthikSubbarajPadam📽️ Begins Today@Suriya_Offl @karthiksubbaraj @hegdepooja @Music_Santhosh @rajsekarpandian @kaarthekeyens @kshreyaas @cheps911 @jacki_art @JaikaStunts @PraveenRaja_Off #Jayaram #Karunakaran… pic.twitter.com/pjyD2GUqFd
— Stone Bench (@stonebenchers) June 2, 2024