Kalki 2898 AD : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ “కల్కి 2898 AD “..స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాను వైజయంతి మూవీస్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది.ఈ సినిమాను మేకర్స్ జూన్ 27 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.ఈ నేపధ్యంలో మేకర్స్ వరుసగా ప్రమోషన్స్ చేస్తున్నారు.అయితే ఈ సినిమాలో స్పెషల్ క్యారెక్టర్ అయిన బుజ్జిని మేకర్స్ గ్రాండ్ గా పరిచయం చేసిన సంగతి తెలిసిందే.ప్రస్తుతం బుజ్జి ని బాగా హైలైట్ చేస్తూ చిత్ర యూనిట్ బాగా ప్రమోట్ చేస్తుంది.ఈ సినిమాలో బుజ్జి పాత్ర చాలా ప్రత్యేకంగా ఉంటుంది అని దర్శకుడు నాగ్ అశ్విన్ తెలిపారు.ఇప్పటికే బుజ్జి కార్ ను మేకర్స్ దేశంలో పలు ప్రధాన నగరాల్లో తిప్పుతూ కల్కి మూవీ ని జోరుగా ప్రచారం చేస్తున్నారు .
Read Also :Suriya 44 : సూర్య ఫస్ట్ షాట్ అదిరిపోయిందిగా..
అలాగే రీసెంట్ గా మేకర్స్ బుజ్జి అండ్ భైరవ అనే యానిమేషన్ వెబ్ సిరీస్ ను కూడా రిలీజ్ చేసారు.ప్రేక్షకులకు కల్కి మూవీ వరల్డ్ ని పరిచయం చేయడానికి ఈ యానిమేటెడ్ వెబ్ సిరీస్ ను తీసుకొచ్చినట్లు దర్శకుడు నాగ్ అశ్విన్ తెలిపారు.ఇదిలా ఉంటే మేకర్స్ బుజ్జి ,భైరవ క్యారెక్టర్స్ తో కల్కి సినిమాపై పిల్లలో కూడా ఆసక్తి పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో బుజ్జి బొమ్మలు ,భైరవ స్టిక్కర్స్ మరియు టీ షర్ట్స్ ను బాగా సేల్ చేస్తున్నారు .కల్కి టీం ఈ గిఫ్ట్స్ ను సెలెబ్రెటీ పిల్లలకి పంపిస్తుంది.తాజాగా రాంచరణ్ కూతురు క్లీంకారకి ఈ గిఫ్ట్స్ ను కల్కి టీం పంపించింది.ఆ గిఫ్ట్స్ ను ఉపాసన తన ఇంస్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది.ఈ స్టోరీలో క్లీంకార సైజు కల్కి కాస్ట్యూమ్ ,బుజ్జి బొమ్మ ,కల్కి స్టిక్కర్స్ మరియు ఒక లెటర్ కూడా వుంది.ప్రస్తుతం ఉపాసన షేర్ చేసిన ఈ ఇంస్టాగ్రామ్ స్టోరీ బాగా వైరల్ అవుతుంది.