ఆదిలాబాద్ జిల్లాను ఒకవైపు చలి వణికిస్తుంటే.. మరోవైపు పులులు జనాన్ని పరుగులు పెట్టిస్తున్నాయి. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో సింగిల్ డిజిట్ కు పడిపోయాయి కనిష్ట ఉష్ణోగ్రతలు. చలికి వణికిపోతుంది ఏజన్సీ. కొమురం భీం జిల్లా లో 9.7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయంటే పరిస్థితి ఎలా వుందో అర్థం చేసుకోవచ్చు. ఆదిలాబాద్ జిల్లాలో 10.1 డిగ్రీలు, నిర్మల్ జిల్లా లో 11.1గా కనిష్ట ఉష్ణోగ్రత లు నమోదయ్యాయి. మంచిర్యాల జిల్లాలో 11.7డిగ్రీలు నమోదు అయింది. దీంతో జనం బయటకు రావాలంటే ఇబ్బంది పడుతున్నారు. చలిగాలుల తీవ్రత వల్ల జలుబు, జ్వరాల బారినపడుతున్నారు.
Read Also: BJP MP Arvind Dharmapuri: ఎంపీ అరవింద్ ఇంటిపై దాడి ఘటన.. 50 మందిపై కేసులు
ఇదిలా ఉంటే.. ఆదిలాబాద్ జిల్లాలో మరోసారి పులి ఆవుపై దాడి చేసి చంపేసింది..భీంపూర్ మండలం తాంసీ కె శివారు ప్రాంతంలో ఆవు కళేబరాన్ని గుర్తించారు అటవీశాఖఅధికారులు.వారం పదిరోజులుగా జైనాథ్ ,భీంపూర్ మండలాల్లో నాలుగు పులుల సంచారం కలలం రేపుతోంది..పులుల సంచారం,పశువులపై దాడులు,,అధికారుల సర్చ్ ఆపరేషన్ పై జనం ఆశలు పెట్టుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా భీం పూర్ మండలం తాంసి కె శివారులో ఆవు డెడ్ బాడీని గుర్తించిన అటవీశాఖ అధికారులు పులి కోసం వేట మొదలెట్టారు.
అటవీ సిబ్బంది అన్వేషణ
పులి కదలికలను పసిగట్టేందుకు 30 కెమెరా ట్రాప్స్ ఏర్పాటు చేశారు. రెండు బేస్ క్యాంప్ లు 20మంది సిబ్బందితో పులుల ట్రాకింగ్ చేస్తున్నాం అని ఎఫ్ డీఓ ఎన్టీవీకి చెప్పారు. వారం పది రోజులుగా జిల్లాలో సంచరిస్తున్న నాలుగు పులుల్ని పట్టుకోవడం అటవీ అధికారులకు, సిబ్బందికి సవాల్ గా మారింది. ఇప్పటికే కెమెరా ట్రాప్స్ లో రికార్డ్ అయిన పులుల ఫోటోలు వైరల్ అవుతున్నాయి. పులుల్ని పట్టుకోవడం అనేది ఇంకా ప్రారంభించలేదు. అయితే, త్వరలో పట్టుకుంటామన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు.
Read Also: Worlds Longest Food Delivery : 30వేల కిలోమీటర్లు ప్రయాణించి ఫుడ్ డెలివరీ చేసిన మహిళ