K. Laxman: మునుగోడు ఉప ఎన్నిక ప్రజల ఆత్మగౌరవానికి.. కేసీఆర్ కుటుంబ అహంకారానికి మధ్య పోరు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మునుగోడు ఉప ఎన్నిక ప్రజల ఆత్మగౌరవానికి కేసీఆర్ కుటుంబ అహంకారానికి మధ్య జరుగుతున్న పోరని BJP పార్లమెంటరీ బోర్డు మెంబర్, రాజ్యసభ సభ్యులు కె.లక్ష్మణ్ అన్నారు. మునుగోడు ఉప ఎన్నికతో TRS నాయకులు, శ్రేణులు కుంగిపోతున్నాయని అన్నారు. ఉద్యమ సమయంలో TRS రాజీనామాలు చేసి ఉద్యమానికి ఊపిరి పోసిందని అన్నారు. ఇప్పుడు ఉప ఎన్నికలు వస్తే ఎందుకు దడ్చుకుంటుందని అన్నారు. దుబ్బాక, హుజురాబాద్ లో ప్రజా తీర్పుతో TRS పై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత వ్యక్తమైందని తెలిపారు. ఉద్యమానికి ఊపిరి పోసిన ఉప ఎన్నికలు.. ఇప్పుడు అవే ఎన్నికలు అంటే TRS నేతల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని ఎద్దేవ చేశారు.
Read also: Munugode by poll: కోమటిరెడ్డిపై అభిమానం కమలం కొంప ముంచుతుందా?
Also Read
- CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
- El Nino : తెలంగాణలో కరువు ముప్పు.. రెండో పంట వేయొద్దంటూ మంత్రి కీలక విజ్ఞప్తి
- Indigo : పవర్ బ్యాంక్లో మంటలు.. శంషాబాద్లో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
- Brilliance AI : విద్యార్థుల చదువుకు ఏఐ సాయం.. హైదరాబాద్లో కొత్త సాఫ్ట్వేర్
మునుగోడులో మంత్రులు, 86 మంది ఎమ్మెల్యేలు మకాం వేయాల్సిన అవసరం ఏముంది? అని ప్రశ్నించారు. కుల, గ్రామాల వారీగా మద్యం, డబ్బులు పంచుతూ ప్రజా అభిప్రాయాన్ని కూడగట్టుకొనే ప్రయత్నం చేస్తోందని అన్నారు. మునుగోడు ఉప ఎన్నిక ప్రజల ఆత్మగౌరవానికి కేసీఆర్ కుటుంబ అహంకారానికి మధ్య జరుగుతున్న పోరని అన్నారు. మునుగోడు ప్రజలు తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని గెలిపించాలని కోరారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు, పార్టీలు ప్రశ్నిస్తే కేసీఆర్ అహంకారపూరితంగా వ్యవహరించారని అన్నారు. మునుగోడులో ఏ మాత్రం అభివృద్ధి చేయలేదని తెలిపారు. కేసీఆర్ అసహనంతో మునుగోడులో లబ్ది పొందేందుకు కొత్త మండలంతో పాటు గిరిజన బంధు ప్రకటించారని విమర్శించారు. కుల వృత్తులపైన ఆధారపడిన బీసీల ఫెడరేషన్, కార్పొరేషన్లకు ఎందుకు నిధులు ఇవ్వడం లేదని అన్నారు. ఓడిపోతామనే భయంతో తోక పార్టీలని విమర్శించిన కేసీఆర్ కమ్యూనిస్టులతో జత కట్టారని అన్నారు. కేసీఆర్, కేటీఆర్ దత్తతా తీసుకుంటనే అభివృద్ధి జరుగుతుందా? అంటూ ప్రశ్నించారు. TRS పార్టీ ఎమ్మెల్యేలు దద్దమ్మలా? అని లక్ష్మన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Gulf oil Corporation: గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్‌కి షాక్.. ఆ స్థలం ఉదాసీన్ మఠం స్వాధీనం
తాజావార్తలు
-
Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభాలే, ఊహించని..!
-
INDIA Bloc: నేడు సుప్రీం కోర్టుకు విపక్ష నేతలు పాదయాత్ర.. భద్రత కట్టుదిట్టం
-
Big Rain Alert: ఏపీకి మరో వాయుగుండం ముప్పు.. అలర్ట్ జారీ చేసిన అధికారులు..
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Shreyas Iyer: ఓడిపోతామనుకున్నా.. అక్కడే మ్యాచ్ మలుపు తిరిగింది..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్స్టీన్ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!