గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్‌కి షాక్ తగిలింది. కూకట్‌పల్లి గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్ ఆధీనంలో ఉన్న ఐడీయల్ స్థలం ఉదాసీన్ మఠానికి చెందినదంటూ గత నెల సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వటంతో ఆ స్థలాన్ని నేడు తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ బాలాజీ, పోలీస్ బందోబస్తు మధ్య ఐడియల్ స్థలంలో ప్రవేశించి, జిఓసియల్ స్థలం అంటూ సూచించే బోర్డులను చెరిపి వేయించారు. స్థలం ఉదాసీన్ మఠానికి చెందినది అంటూ బోర్డులను ఏర్పాటు చేశారు.
Read Also:Vishaka Garjana: మూడురాజధానులు కావాల్సిందే… గళమెత్తిన జనం
540 ఎకరాల స్థలం ఉదాసీన్ మఠానికి చెందినదని సుప్రీం తీర్పుతో స్థలాన్ని స్వాధీనం చేసుకొని మఠాధిపతులకు అందజేస్తున్నామని తెలిపారు. ఉదాసీన్ మఠాధిపతి మహాంత్ శ్రీ రఘు మునీజీ మాట్లాడుతూ ఈ స్థలంలో తమ గురువులు, తపస్సు చేశారని, పవిత్రమైన తపో భూమిలో అనాథ శరణాలయం, విశ్వవిద్యాలయం, అన్నదాన సత్రం ఏర్పాటు చేస్తామని ఉదాసీన్ మఠం ప్రతినిధి మహాంత్ శ్రీ రఘు మునీజీ అన్నారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ బాలాజీ పాల్గొన్నారు.
Read Also: Munugode by poll: కోమటిరెడ్డిపై అభిమానం కమలం కొంప ముంచుతుందా?