Pocharam Srinivas Reddy: “అది నిరూపిస్తే రాజకీయం వదిలేస్తా”.. పోచారం శ్రీనివాసరెడ్డి సవాల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pocharam Srinivas Reddy: ఇటీవల తాను చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి రాజకీయం దురుద్దేశ్యం లేదని.. బుద్ధిహీనులు నాకు స్వార్ధం ఉందని మాట్లాడుతున్నారని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. గురువారం కామారెడ్డి జిల్లా వర్ని మండలంలో పర్యటించి, జాకోరా గ్రామంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇటీవల తాను చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. తనకు స్వార్థం ఉందని నిరూపిస్తే రాజకీయాలు వదులుకుంటానన్నారు. “నా మాటల వెనుక రాజకీయం, రహస్యం లేదు. నేను డబ్బులకు అమ్ముడుపోయే వ్యక్తిని కాదు. నాకు ఎలాంటి స్వార్థం లేదు. ప్రజల కోసమే నా జీవితం. అభివృద్ధి కోసమే ముఖ్యమంత్రికి మద్దతు తెలిపాను. అన్నం పెట్టిన వాళ్లను మర్చిపోతే పుట్టగతులుండవు. కేసీఆర్ చేసిండు కాబట్టే చేసిండు అని చెప్పాను. రేవంత్ రెడ్డి ఇచ్చినవి కూడా చెబుతాను. ఉన్నది ఉన్నట్లు చెప్పడం నా నైజం. పోరాటం చేస్తా తప్ప, తల వంచే రాజకీయం చేయను. నా ప్రజల కోసం, నియోజకవర్గ అభివృద్ధి కోసం ఏమైనా చేస్తాను. ఎమ్మెల్యేకు ప్రభుత్వ సహకారం కావాలి. ప్రభుత్వ సహకారం లేకుంటే ఏమి చేయలేం.” అని వ్యాఖ్యానించారు.
నియోజకవర్గ అభివృద్ధి కోసమే సీఎం రేవంత్ వద్దకు వెళ్లి కండువా కప్పుకొన్నట్లు ఇటీవల మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఆరు నెలల్లో పెండింగ్ బిల్లులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారని.. సగం నిధులు మాత్రమే ఇచ్చారన్నారు. కామారెడ్డి జిల్లా బీర్కూరులో కార్యకర్తలతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో పోచారం ఈ వ్యాఖ్యలు చేశారు. బిల్లులు పెండింగ్‌లో ఉండటం వల్ల గుత్తేదారులు పనులు ఆపేశారని.. నవంబర్‌లో ఫిరాయింపు ఎమ్మెల్యేల భేటీ నిర్వహించారమన్నారు. ఆ సమావేశంలో సీఎం రేవంత్‌ను సూటిగా ప్రశ్నించినట్లు తెలిపారు. సీఎం చెప్పినట్లుగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి నిధులు మంజూరు చేయలేదని మండిపడ్డారు. కేసీఆర్ హయాంలోనే నియోజకవర్గంలో అభివృద్ధి జరిగిందని స్పష్టం చేశారు. ఈ వ్యాక్యలపై ఒక్కసారిగా రాజకీయ దుమారం రేగింది. దీంతో మరోసారి ఈ వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చారు.
Also Read
తాజావార్తలు
-
OTR : కాంగ్రెస్‌లో ఇక గీత దాటితే ఎంతటి వారికైనా వేటు తప్పదా?
-
India Won: పాకిస్థాన్ చిత్తు చిత్తు.. 8.4 ఓవర్లోనే టార్గెట్ ఛేదించిన టీమిండియా..
-
Temple Theft : నిర్మల్‌లో గుడి దొంగల గ్యాంగ్ అరెస్ట్.. 12 కిలోల వెండి స్వాధీనం!
-
OTR : బీఆర్ఎస్లో కొండా సురేఖకు ‘నో ఎంట్రీ’
-
OTR : కావలిలో క్రెడిట్ వార్.. ఎమ్మెల్యే vs మాజీ ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!