IMD Hyderabad: తెలంగాణాలో మూడు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండి వెల్లడించింది. తెలంగాణ, ఉత్తర తమిళనాడు వరకు ద్రోణి కొనసాగుతుండటంతో రాష్ట్రంలో మళ్లీ వర్షాలు మొదలయ్యాయి. నిన్నటి నుంచి రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. నిన్న ఆదివారం మధ్యాహ్నం నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఈరోజు ఉదయం నుంచి వర్షం మొదలైంది. ఉదయం నుంచి నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. ఈరోజు, రేపు, ఎల్లుండి కూడా నగరంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఉదయం నుంచి వర్షం కురుస్తోంది. ఎల్బీనగర్, కొత్తపేట, చైతన్యపురి, దిల్ సుఖ్ నగర్, మలక్ పేట, నాంపల్లి, లక్డీకపూల్, బంజారాహిల్స్, ఖైరతాబాద్, పంజాగుట్ట, అంబర్ పేట్, ఓయూ, కోఠి, తిరుమలగిరి, సికింద్రాబాద్ తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. భాగ్యనగరమంతా మేఘావృతమైంది. ఆదివారం సాయంత్రం కూడా నగరంలో భారీ వర్షం కురిసిన సంగతి తెలిసిందే. పలుచోట్ల ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. ఈదురు గాలులకు పలుచోట్ల చెట్లు విరిగిపడ్డాయి. తెలంగాణలో రానున్న మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. విదర్భ నుంచి తెలంగాణ, ఉత్తర తమిళనాడు మీదుగా దక్షిణ తమిళనాడు వరకు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో ఉత్తర, దక్షిణ ద్రోణిలు ఏర్పడ్డాయని, వీటి ప్రభావంతో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మరో మూడు రోజులు పగటి ఉష్ణోగ్రతలు 40 నుంచి 43 డిగ్రీలు, హైదరాబాద్ సమీపంలోని జిల్లాల్లో 38 నుంచి 41 డిగ్రీలు నమోదయ్యే అవకాశం ఉంది. రాష్ట్రంలో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వెల్లడించింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పసుపు హెచ్చరిక జారీ చేశారు.
ఆదివారం నుంచి సోమవారం ఉదయం వరకు రాష్ట్రంలోని కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. సోమవారం పలుచోట్ల పొడి వాతావరణం ఏర్పడుతుందని, కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. మంగళవారం నుంచి జూన్ 3 వరకు పలుచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని, పలుచోట్ల ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ వివరించింది.
GSLV-F12: సవ్యంగా సాగుతోన్న కౌంట్‌డౌన్ ప్రక్రియ.. నేడు జీఎస్‌ఎల్‌వీ ఎఫ్–12 ప్రయోగం