* ఐపీఎల్: నేడు గుజరాత్-చెన్నై మధ్య ఫైనల్ మ్యాచ్.. వర్షం కారణంగా నిన్న జరగాల్సిన ఐపీఎల్ ఫైనల్ నేటికి వాయిదా.. అహ్మదాబాద్ వేదికగా మ్యాచ్.. ఇవాళ మ్యాచ్ రద్దైతే విజేతగా నిలవనున్న గుజరాత్ టైటాన్స్
* శ్రీహరి కోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి నేడు GSLV F-12 రాకెట్ ప్రయోగం.. నిన్న ఉదయం మొదలైన కౌంట్ డౌన్.. సవ్యంగా సాగుతోందని శాస్త్రవేత్తల వెల్లడి.. 2 వేల 232 కిలోల బరువైన నావిక్-01 ఉపగ్రహాన్ని రోదసిలోకి ప్రవేశపెట్టనున్న రాకెట్
* నేడు విజయవాడకు సీఎం వైఎస్ జగన్.. ఉదయం 8 గంటలకు ఢిల్లీ నుంచి బయల్దేరనున్న సీఎం జగన్
* నేడు రాహుల్ గాంధీ అమెరికా పర్యటన.. వచ్చే నెల మొదటివారంలో ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ సమావేశం..
* నేడు మణిపూర్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పర్యటన
* విజయవాడ: నేడు దుర్గగుడి ధర్మకర్తల మండలి సమావేశం..
* నెల్లూరు : రామాయపట్నం పోర్టు నిర్మాణ పనులను పరిశీలించనున్న మంత్రులు గుడివాడ అమర్నాథ్, కాకాణి గోవర్ధన్ రెడ్డి..
* ప్రకాశం : పెద్దారవీడు మండలం గోబ్బురులో వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి ఆదిమూలపు సురేష్.. అనంతరం గడప గడపకు మనప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొంటారు.
* నేటి నుంచి నెల్లూరు.. కావలి పాలిటెక్నిక్ లలో ప్రవేశాలకు కౌన్సిలింగ్
* ప్రకాశం : ఒంగోలు కలెక్టరేట్ లో జగనన్న విద్యాదీవెన పథకంపై జిల్లా ప్రైవేట్ కళాశాలల ప్రతినిధులతో కలెక్టర్ దినేష్ కుమార్ సమీక్ష..
* ప్రకాశం : ఒంగోలు లోని శ్రీ గిరి వెంకటేశ్వరస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు ప్రారంభ సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు..
* ఒంగోలు లోని డీఏ పాలిటెక్నిక్ కళాశాలలో పాలీసెట్ అడ్మిషన్లకు ఆన్ లైన్ లో మాన్యువల్ గా కౌన్సిలింగ్..
* తూర్పుగోదావరి జిల్లాలో నేడు హోం మంత్రి తానేటి వనిత పర్యటన కార్యక్రమాలు. రాజమండ్రి కలెక్టర్ ఆఫీస్ లో ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు మీటింగ్ లో పాల్గొంటారు. మధ్యాహ్నం ఓ ప్రైవేట్ ఫంక్షన్ లో పాల్గొంటారు.
* వైఎస్సార్సీపీ ప్రభుత్వం నాలుగేళ్ల పాలన పూర్తయిన సందర్భంగా హోం మంత్రి తానేటి వనిత బైక్ ర్యాలీ.. పంగిడి నుంచి కాపవరం జంక్షన్, ధర్మవరం, పెనకన మెట్ట, దొమ్మేరు, కొవ్వూరు టౌన్ 1,2,3,4 వార్డులు, శివానంద పార్క్, విజయ విహార్ సెంటర్, LIC ఆఫీస్, కాకతీయ అపార్ట్మెంట్స్, ఇందిరమ్మ కాలనీ, భవ్య అపార్ట్మెంట్స్, బస్టాండ్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్, బుద్ధ విగ్రహం, అచ్చయమ్మ కాలనీ మీదుగా మినిస్ట్రీ క్యాంప్ ఆఫీస్ వరకు బైక్ ర్యాలీ.
* పశ్చిమ గోదావరి: తణుకులో మంత్రి కారుమూరు నాగేశ్వరావు పర్యటన.. పేదలకు ఇచ్చిన ఇంటి స్థలాలపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై నిరసన ర్యాలీ నిర్వహించనున్న మంత్రి..
* అనంతపురం: కళ్యాణదుర్గం మండలo పాలవాయి గ్రామంలో వేరుశనగ విత్తన పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి ఉషశ్రీ చరణ్
* అనంతపురం : నేడు నగరంలోని టవర్ క్లాక్ ఫ్ల్తె ఓవర్ బ్రిడ్జి ప్రారంభం.. జూన్ 1 నుంచి రాకపోకలకు అనుమతి.
* అనంతపురం : తాడిపత్రిలో నేడు ప్రజా సంక్షేమ యాత్ర ముగింపు సభ.. గన్నెవారి పల్లి కాలనీలో బహిరంగ సభ.
* చిత్తూరు: ఎస్ఆర్ పురం సచివాలయం పరిధిలో గడపగడపకి మన ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొననున్న డిప్యూటీ సీఎం నారాయణస్వామి
* కర్నూలు: ఆలూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేయనున్న గుమ్మనూరు నారాయణ.. పాల్గొనున్న మంత్రి గుమ్మనూర్ జయరాం.
* నంద్యాల: నేడు సప్త నదుల సంగమేశ్వరం ఆలయంలో అభిషేకాలు, మంగళ హారతి ప్రత్యేక పూజలు
* తిరుమలలో 23 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 78,818 మంది భక్తులు, తలనీలాలు సమర్పించిన 39,076 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.3.66 కోట్లు
* గుంటూరు: నేడు పెదకాకాని మండలం ఉప్పలపాడు గ్రామంలో పర్యటించనున్న మంత్రులు బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్, జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్న ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు.
* పల్నాడు: ప్రభుత్వంపై , పేదల స్థలాలపై చంద్రబాబు వ్యాఖ్యలకు నిరసనగా నేడు చిలకలూరిపేట గడియార స్తంభం సెంటర్ నుండి బైక్ ర్యాలీ నిర్వహించనున్న మంత్రి విడదల రజని…
* సీఎం జగన్ నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వ పాలన నాలుగేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా విజయనగరం నియోజకవర్గ నాయకుల ఆధ్వర్యంలో నేడు నగరంలో భారీ బైక్ ర్యాలీ.. ఏపీ శాసనసభ ఉపసభాపతి కోలగట్ల వీరభద్ర స్వామి నివాసం నుంచి ప్రారంభమై.. వైఎస్సార్ సర్కిల్ వరకు కొనసాగనున్న ర్యాలీ.
* భద్రాద్రి: నేడు పినపాక నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ పర్యటన, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు
* ఖమ్మం: మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో నేడు ఖమ్మంలో జాబ్ మేళా.. అయిదు వేల మంది కి ఉద్యోగాల ప్రక్రియకు ఇంటర్వ్యూ లు
* 74వ రోజుకు చేరిన సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పాదయాత్ర.. నాగర్ కర్నూల్ నియోజకవర్గం తాడూరు మండల కేంద్రం నుంచి ఈరోజు ఉదయం 8 గంటలకు పాదయాత్ర ప్రారంభం.. తాడూరు, గగ్గలపల్లి, మంతటి క్రాస్ రోడ్, దేశిట్క్యాల్ గ్రామాల వరకు కొనసాగనున్న పీపుల్స్ మార్చ్ పాదయాత్ర.