మలేసియా వెళ్లడానికి వాల్తేరు వీరయ్య రెడీ అయ్యాడు. ఓ సీక్రెట్ ఆపరేషన్ కోసమే ఈ ప్రయాణమని విశ్వసనీయ సమాచారం. టార్గెట్ ఎవరు? ప్లాన్ ఎలా డిజైన్ చేశారు.. అనే అంశాలు తెలియడాని కొంత సమయం పడుతుంది. కానీ.. మెగాస్టార్ చిరంజీవి హీరోగా కేఎస్ రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో ‘వాల్తేరు వీరయ్య’ అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో శ్రుతీహాసన్ హీరోయిన్. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న సినిమా ఇది.
ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ దాదాపు 30 శాతం పూర్తయింది. ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ మలేసియాలో ప్రారంభం కానుందని సమాచారం. జూన్ మొదటివారంలో లేదా రెండోవారం ప్రారంభంలో చిరంజీవి, బాబీ అండ్ కో మలేసియాకు పయనం అవుతారు. సుమారు 20 రోజులు అక్కడ షూట్ ప్లాన్ చేశారని తెలిసింది. ఈ సినిమాకు ఈ షూటింగ్ కీలకమని సమాచారం. ప్రస్తుతం వెకేషన్‌లో ఉన్న చిరు, తిరిగి రాగానే గాడ్‌ఫాదర్ సినిమాలోని ఓ సాంగ్ చిత్రీకరణలో పాల్గొని, అటుపై వాల్తేర్ వీరయ్య కోసం మలేషియా చెక్కేస్తాడనే వార్తలు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్నాయి.
కాగా.. ఈ సినిమాలో చిరు సరసన అందాల భామ శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, కేథరిన్ త్రేజా, సముధ్రకని, బాబీ సింహాలు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించనుండగా, మైత్రీ మూవీ మేకర్స్ వారు ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు. మరి ఈ సినిమాను ఎప్పుడు పూర్తి చేస్తారా.. ఎప్పుడు రిలీజ్ చేస్తారా అని మెగా ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Rk Roja : ఆయన ప్రాణాలు తీసి.. దండలు, దండం పెడుతున్నాడు