తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు ముహూర్తం ఖరారైంది. మూడు విడతలుగా పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 27న ఎన్నికల నోటిఫికేషన్‌ను ఎన్నికల రిటర్నింగ్ అధికారులు జారీ చేయనున్నారు. నోటిఫికేషన్ విడుదల నుంచి పోలింగ్‌కు పదిహేను రోజుల సమయం ఉంది. డిసెంబర్ 11న మొదటి విడత పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుంది. పోలింగ్ ముగిసిన తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు, ఫలితాల…
మాటల తూటాలు పేలుతున్నాయి. డైలాగ్‌లు ఆటంబాంబుల్లా రీసౌండ్‌నిస్తున్నాయి. ఎన్నికల్లో హీట్ పెంచడానికి కొందరు నేతలు వాడుతున్న అభ్యంతకర భాష శ్రుతిమించుతోందా?.. జూబ్లీహిల్స్ ఎన్నికలో మూడు పార్టీల పెద్ద నాయకుల లాంగ్వేజ్ హద్దు దాటుతోందా? జూబ్లీహిల్స్ పోలింగ్ దగ్గరపడేకొద్దీ మాటల తూటాలు పేలుతున్నాయి. గల్లీగల్లీ చుట్టేస్తూ..రోడ్ షోలు నిర్వహిస్తూ లీడర్లు డైలాగ్ డోస్ పెంచుతున్నారు. అంతవరకు బాగానే ఉన్నా…లాంగ్వేజ్‌ని మరో లెవెల్ కి తీసుకెళ్లడమే క్యాంపెయిన్ తీరును మార్చేస్తోంది. ఒకరిని మించి ఒకరు మాటల స్థాయిని దిగజారేస్తున్నారు. ఒకప్పుడు…
Ponnam Prabhakar: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా యూసుఫ్‌గూడలో ఎన్నికల ప్రచారంలో నిర్వహించారు హైదరాబాద్ ఇన్‌ఛార్జి మంత్రి పొన్నం ప్రకాష్ భాకర్.. ఈ సందర్భగా ఆయన మీడియాతో మాట్లాడారు. మా అభ్యర్థి యువకుడు, స్థానికుడు, ఉత్సాహవంతుడు అని పేర్కొన్న ఆయన, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే అభివృద్ధికి మరింత అవకాశం ఉంటుందని ప్రజలు విశ్వసిస్తున్నారని తెలిపారు. గతంలో అధికారంలో ఉన్నప్పటికీ అభివృద్ధి చేయకుండా నిర్లక్ష్యం చేసినవారిని ప్రజలు తిరస్కరించారని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం…
KTR slammed Revanth Reddy: భారత ఆర్మీపై రేవంత్ రెడ్డి చేసిన నీచమైన కామెంట్స్ ని వెనక్కి తీసుకోవాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. భారత ఆర్మీకి క్షమాపణ చెప్పాలన్నారు. కేవలం ఎన్నికల్లో లబ్ధి కోసం ఆర్మీని రేవంత్ రెడ్డి వాడుకోవడంపైన కేటీఆర్ మండిపడ్డారు. సైన్యంలో చేరి, తమ ప్రాణాలను పణంగా పెట్టడానికి అపారమైన కృషి, అంకితభావం, నిబద్ధత, దేశంపై ప్రేమ అవసరమన్నారు. యూనిఫామ్ ధరించిన మన సైనికులు అత్యంత కఠినమైన…
Jubilee Hills Byelection: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నామినేషన్ల ప్రక్రియలో చివరి రోజున భారీ హడావుడి నెలకొంది. నామినేషన్ల దాఖలుకు ఇవాళే చివరి రోజు కావడంతో అభ్యర్థులు పెద్ద ఎత్తున రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయానికి తరలివస్తున్నారు. ఈ క్రమంలో రాజకీయ నేతలతో పాటు సాధారణ ప్రజలు కూడా పోటీకి రంగంలోకి దిగుతున్నారు. ఓవైపు నిరుద్యోగులు తమ సమస్యలను ప్రజల ముందుకు తీసుకురావడానికి నామినేషన్లు వేస్తుండగా, మరోవైపు ఫార్మాసిటీ, RRR ప్రాజెక్టుల బాధితులు పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేస్తున్నారు.…
Sarpanch Eligibility: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది ఎన్నికల కమిషన్ (EC). గ్రామ పంచాయతీ, మండల, జిల్లా పరిషత్ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఐ.రాణీకుముదిని సోమవారం విడుదల చేశారు. తొలుత మండల, జిల్లా పరిషత్‌ల ఎన్నికలు జరగనున్నాయి. స్థానిక సమరం మొత్తం ఐదు దశల్లో జరగనుంది. మండల, జిల్లా పరిషత్‌ల తొలి విడత ఎన్నికలు అక్టోబర్ 23న, రెండో విడత అదే నెల 27న జరగనున్నాయి. గ్రామ పంచాయతీల…
BRS : రైతు భరోసా పెట్టుబడి సాయాన్ని ఎకరాకు ఏడాదికి రూ.15 వేల నుంచి రూ.12 వేలకు తగ్గించి తెలంగాణ రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ద్రోహానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ సోమవారం రాష్ట్రవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది . కాపు సామాజిక వర్గానికి సంఘీభావంగా అన్ని జిల్లాలు, మండలాలు, నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలు నిర్వహించనున్నారు. ఆదివారం తెలంగాణ భవన్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు మీడియాతో మాట్లాడుతూ రైతు భరోసా పథకం కింద ఎకరాకు రూ.15 వేలు…