Rahul Gandhi and KTR Tour: వరంగల్‌లో పొలిటికల్ హీట్.. 6న రాహుల్, 7న కేటీఆర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇప్పుడు వరంగల్‌లో రాజకీయ పరిణామాలు హీట్ పెంచుతున్నాయి.. ఇప్పటికే వరంగల్‌లో పలు సార్లు మంత్రి కేటీఆర్ పర్యటించారు.. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పర్యటన ఖరారైన తర్వాత కూడా ఈ మధ్యే వరంగల్‌కు వెళ్లివచ్చారు.. ఇప్పుడు మరోసారి అదే జిల్లాలో టూర్‌కు సిద్ధం అయ్యారు. అది కూడా రాహుల్ గాంధీ సభ ముగిసిన మరుసటి రోజే కావడం ఆసక్తికరంగా మారింది. ఈ నెల 6వ తేదీన వరంగల్ వస్తున్నారు రాహుల్.. రైతు సంఘర్షణ సభ పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తుంది.. అయితే, మరుసటి రోజే అంటే ఈ నెల 7న మంత్రి కేటీ వరంగల్ పర్యటనకు రానున్నారు.
Read Also: Karnataka: పదవి చేపట్టి 9 నెలలే.. మళ్లీ సీఎంను మారుస్తున్న బీజేపీ..!
Also Read
- Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
- CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటే ప్రజలే బండకేసి కొడతారు.. సీఎం రేవంత్‌రెడ్డి ఫైర్
- Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
- Saturday Holiday: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. ఇక అన్ని శనివారాలు సెలవులే.. తెలంగాణలో..?
ఈసారి తన పర్యటనలో ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కైటెక్స్ మెగా టెక్ట్స్‌టైల్స్ పార్క్‌కు శంకుస్థాపన, భూమి పూజ చేయనున్నారు మంత్రి కేటీఆర్… అలాగే, గణేష్ టెక్ట్స్‌టైల్స్ ఇండస్ట్రీస్‌ను ప్రారంభిస్తారు. అంతకు ముందు మంత్రి కేటీఆర్ హనుమకొండలోని పీజేఆర్ గార్డెన్స్ లో ఐటీ ప్రొఫెషనల్స్ తో ఇంటరాక్షన్ కాబోతున్నారు.. ఐటీ రంగం, ఐటీ కంపెనీల విస్తరణ, అవకాశాలు, ఉపాధి వంటి పలు అంశాలపై చర్చించనున్నారు. ఇక, ఆ తర్వాత ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజా ప్రతినిధులతో సమావేశం కాబోతున్నారు.. ఆ సమావేశం తర్వాత సాప్ట్ పాత్ ఐటీ ఆఫీసును సందర్శించే అవకాశం ఉంది. మరోవైపు కేటీఆర్ పర్యటన ఏర్పాట్లపై హన్మకొండలోని తన క్యాంప్ కార్యాలయలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్, ఎమ్మెల్యేలు చల్లా ధర్మా రెడ్డి, అరూరి రమేష్.. తదితర నేతలు సమావేశమై చర్చించారు. మొత్తంగా వరంగల్ వేదికగా ప్రభుత్వ విధానాలను ఎండగట్టేందుకు కాంగ్రెస్ సిద్ధం అవుతుంటే.. మరుసటి రోజే తన పర్యటనలో కేటీఆర్ కౌంటర్ ఎటాక్ చేయబోతున్నారనే చర్చ సాగుతోంది.
- Tags
- congress
- ktr
- rahul gandhi
- telangana
- TRS
తాజావార్తలు
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్‌కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App Update: వాట్సాప్‌లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
-
Asaduddin Owaisi: ‘‘ఆరుగురు పిల్లలు ఉన్నంత మాత్రాన..’’ ఓటర్ల జాబితా మ్యాపింగ్‌పై ఓవైసీ ఆగ్రహం..
-
Bill Gates: నేనెవరినీ వేధించలేదు.. ఎప్స్టీన్ కేసు విచారణలో బిల్‌గేట్స్ కీలక వ్యాఖ్యలు
-
BAN vs AUS: ఆసీస్‌కు ఊహించని షాక్.. 21 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాపై బంగ్లాదేశ్ ఘన విజయం..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!