CM Chandrababu: ‘స్వయం ఏపీ’ బ్రాండ్.. 10 లక్షల మంది మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu at Saras Mela 2026: మహిళా సాధికారత, గ్రామీణ మహిళల ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు సాగుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. దసరా శరన్నవరాత్రుల సందర్భంగా విజయవాడలో నిర్వహిస్తున్న జాతీయ ‘సరస్ మేళా’ 2026 కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. డ్వాక్రా మహిళలు తయారు చేస్తున్న ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం ‘స్వయం ఏపీ’ బ్రాండ్‌ను తీసుకొచ్చినట్లు వెల్లడించారు. ఈ బ్రాండ్ ద్వారా మహిళా సంఘాల ఉత్పత్తులను ఈ-కామర్స్, ఆన్లైన్ షాపింగ్ వేదికలపై అందుబాటులోకి తీసుకురానున్నట్లు సీఎం చెప్పారు. జాతీయ సరస్ మేళాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు సభలో మాట్లాడారు.
‘ఢిల్లీలో నిర్వహించే జాతీయ మహిళా సరస్ మేళాను తొలిసారిగా ఢిల్లీ వెలుపల విజయవాడలో నిర్వహించడం ఓ ప్రత్యేకత. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు విచ్చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నారీశక్తికి, నవభారత శక్తికి ప్రతిరూపం. గ్రామీణ మహిళల ఆదాయాన్ని పెంచడం, మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం, గ్రామీణ ఉత్పత్తులకు విస్తృత గుర్తింపు తీసుకురావడమే సరస్ మేళా ప్రధాన ఉద్దేశం. మహిళలు ఆర్థికంగా ఎదిగితే వారి కుటుంబాలతో పాటు సమాజం, దేశం కూడా అభివృద్ధి చెందుతాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లక్ష్యం ఆరు కోట్ల మంది మహిళలను ‘లఖ్పతి దీదీ’లుగా తీర్చిదిద్దడమే. మహిళలు కేవలం పొదుపు చేసే స్థాయి నుంచి ఆదాయం సంపాదించే వ్యాపారవేత్తలుగా ఎదగాలి’ అని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు.
Also Read
- Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
- Jasprit Bumrah: వన్డేలకు దూరంగా జస్పీత్ బుమ్రా.. టీమ్ మేనేజ్మెంట్ ప్లాన్ ఇదే..
- Nepal PM Balendra Shah: భారత్‌కు నేపాల్ ప్రధాని బలేంద్ర షా.. ప్రధానిగా తొలి ద్వైపాక్షిక విదేశీ పర్యటన!
- How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
‘గతంలో పొదుపు సంఘాలుగా ప్రారంభమైన మహిళా సంఘాలు నేడు వ్యాపార సంస్థలుగా అభివృద్ధి చెందాయి. భవిష్యత్తులో ఇవే అంతర్జాతీయ బ్రాండ్లుగా ఎదగాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రారంభమైన డ్వాక్రా పొదుపు ఉద్యమం దేశం గర్వించే స్థాయికి చేరుకుంది. రాష్ట్రంలో 11 లక్షల స్వయం సహాయక సంఘాలు రూ.69 వేల కోట్ల టర్నోవర్‌తో పనిచేస్తున్నాయి. ఏడాది కాలంలో లక్ష మంది స్వయం సహాయక సంఘాల మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దాము. ఐదు లక్షల మంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా మార్చేందుకు కృషి చేస్తున్నాము. దీర్ఘకాలిక లక్ష్యంగా 10 లక్షల మంది మహిళలను ఎంటర్ప్రెన్యూర్లుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం పనిచేస్తుంది’ అని సీఎం వివరించారు.
‘ఏపీలో మహిళా సంఘాలు తయారు చేస్తున్న ఉత్పత్తులకు స్వయం ఏపీ బ్రాండ్ తీసుకువచ్చాం. ఈ-కామర్స్, ఆన్ లైన్ షాపింగ్‌లో స్వయం ఏపీ పేరుతో ఉత్పత్తులు అందుబాటులోకి వస్తాయి. సంక్షేమంతో పాటు మహిళలకు భరోసా ఇచ్చేలా వారి సాధికారిత కోసం పనిచేస్తున్నాం. మహిళా శక్తిని బలోపేతం చేసేలా తల్లికి వందనం ఇస్తున్నాం. స్త్రీశక్తితో ఉచిత బస్సు ప్రయాణంతో 100 కోట్ల ప్రయాణాలు మహిళలు చేశారు. సంక్షేమ పథకమైనా, అభివృద్ధి కార్యక్రమం అయినా మహిళల పేరుతోనే అమలు చేస్తున్నాం. ప్రతీ మహిళకు వెల్ఫేర్ టు వెల్త్ అందాలనేది మా నినాదం. సేవింగ్ మనీ స్థాయి నుంచి మేకింగ్ మనీ స్థాయికి మన ఎస్‌హెచ్‌జీ బృందాలు అభివృద్ధి చెందాయి. దేశంలోని ప్రతీ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ భారత్ దేశాన్ని ఆర్ధిక శక్తిగా మార్చటంలో అత్యంత కీలకపాత్ర పోషిస్తుంది. మహిళలకు ఆర్ధిక, సామాజిక, రాజకీయ భద్రత కల్పించటంతో పాటు సాధికారిత దిశగా ఏపీ పనిచేస్తోంది. ఎస్ హెచ్ జీల సాయంతో స్వర్ణాంధ్ర 2047 కలను సాకారం చేసేలా ముందుకు వెళ్తున్నాం. ప్రతీ ఎస్ హెచ్ జీ ఓ ఆర్ధిక శక్తిగా, ప్రతీ మహిళా పారిశ్రామికవేత్తగా, ప్రతీ గ్రామం ఉపాధి కేంద్రంగా ఎదగాలన్నదే మా ఆలోచన’ అని సీఎం చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
CM Chandrababu: ‘స్వయం ఏపీ’ బ్రాండ్.. 10 లక్షల మంది మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యం!
-
Rashmika : 400 కుటుంబాలను దత్తత తీసుకున్న రష్మిక
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
Aadarsha Kutumbam : ఆదర్శ కుటుంబం జాడేది?
-
Sai Durgha Tej: పవన్ కల్యాణ్‌తో మూవీ ఎప్పుడు?.. తప్పు మాదే అంటూ సాయి ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్‌గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!