Congress Councillors: కాంగ్రెస్‌కు ఏడుగురు కౌన్సిలర్ల రాజీనామా.. !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress Councillors: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా కాంగ్రెస్‌లో అంతర్గత విబేధాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. సొంత పార్టీ సీనియర్ నేతలు, మంత్రుల తీరుపై తీవ్ర అసంతృప్తితో ఏకంగా ఏడుగురు కౌన్సిలర్లు మూకుమ్మడిగా పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయడం ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో పెను దుమారం రేపుతోంది. మంత్రి జూపల్లి కృష్ణారావు, క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవిలు బీఆర్ఎస్ నాయకులకు కొమ్ముకాస్తున్నారంటూ వారు బాహాటంగానే ఆరోపణలు గుప్పిస్తూ తిరుగుబాటుకు దిగారు. జోగులాంబ గద్వాల జిల్లాలోని ఐజా మున్సిపాలిటీకి చెందిన ఏడుగురు కాంగ్రెస్ కౌన్సిలర్లు ఈ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు.
కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ నియోజకవర్గంలో బీఆర్ఎస్ నాయకుల పెత్తనమే నడుస్తోందని, దీనికి మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి పూర్తి సహకారం అందిస్తున్నారని వారు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కష్టపడి పార్టీని గెలిపించిన కార్యకర్తలను, కౌన్సిలర్లను కాదని.. ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలకు మద్దతుగా నిలుస్తుండటాన్ని నిరసిస్తూ తాము కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెబుతున్నట్లు స్పష్టం చేశారు. తమ రాజీనామా పత్రాలతో పాటు, స్థానిక పరిస్థితులను వివరిస్తూ టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్‌కు ఆ ఏడుగురు కౌన్సిలర్లు ఘాటుగా లేఖ రాశారు. సీనియర్ నాయకుల వ్యవహార శైలి వల్ల నియోజకవర్గంలో పార్టీ క్యాడర్ నైతిక స్థైర్యం దెబ్బతింటోందని, పార్టీ కోసం పనిచేసేవారికి గుర్తింపు లేకుండా పోయిందని ఆ లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. అధికార పార్టీకి చెందిన ఏడుగురు కౌన్సిలర్లు ఒకేసారి మూకుమ్మడిగా రాజీనామా బాట పట్టడంతో స్థానిక రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. అధిష్ఠానం ఈ వ్యవహారంపై ఎలా స్పందిస్తుందోనన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.
Also Read
- Vemulawada: శవం ముందు ఆస్తి పంచాయితీ! వేములవాడలో మానవత్వం మంటగలిసిన వైనం..
- CM Revanth Reddy: మనకు ఏ రాష్ట్రంతోనూ పోటీ లేదు, నేరుగా చైనా, జపాన్‌తోనే పోటిపడుతున్నాం..
- Harassment: గురూజీ వలలో సాఫ్ట్వేర్ ఉద్యోగి భార్య.. అంతా చాటింగ్‌ల ద్వారానే..
- Indiramma Indlu: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు శుభవార్త.. అదనంగా మరో రూ.72 వేలు అకౌంట్లోకి..
తాజావార్తలు
-
Congress Councillors: కాంగ్రెస్‌కు ఏడుగురు కౌన్సిలర్ల రాజీనామా.. !
-
Meerut Blue Drum Murder: మీరట్ ‘‘బ్లూ డ్రమ్ మర్డర్’’.. మరణశిక్ష విధిస్తూ ‘‘భగవద్గీత’’ను ప్రస్తావించిన న్యాయమూర్తి.!
-
Tecno Spark 50s 5G: టెక్నో Spark 50s 5G లాంచ్ డేట్ ఫిక్స్.. iPhone 18 Pro తరహా Burgundy Red కలర్లో కొత్త ఫోన్!
-
Vangaveeti Radha Joins Jana Sena: జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ.. కండువా కప్పి ఆహ్వానించిన పవన్.. మేయర్ రేసులో..?
-
CJP: ‘‘సంతకాలు చేసి ఉల్లంఘించారు’’.. కాక్రోచ్ నేతలను జైలుకు పంపడానికి కారణాలివే.!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..