తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు సిద్ధిపేట జిల్లా పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. రాబోయే కొద్ది రోజుల్లో సొంత జాగాల్లో డబుల్ బెడ్ రూం ఇండ్లు కట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నామని హరీశ్ రావు తెలిపారు. కరోనాతో ఖర్చు పెరిగింది. ఆదాయం తగ్గింది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్నారని తెలిపారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా తెలంగాణలో ఈ యాసంగిలో భూమికి బరువు పెరిగేంత వడ్ల దిగుబడి వచ్చిందని మంత్రి తెలిపారు. యాసంగిలో ఎన్నడూ లేనివిధంగా 90 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లను ప్రభుత్వం కొనుగోలు చేసిందని స్పష్టం చేశారు.