Ponguleti Srinivas Reddy : రైతుల భూ సమస్యలను పరిష్కరించేందుకు ఇది తొలి అడుగు
- శిల్పకళావేదికలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా లైసెన్సుల పంపిణీ
- గత ప్రభుత్వ తప్పులను సరిదిద్దుతూ రైతులకు న్యాయం
- నిరుద్యోగ యువతకు అవకాశాలు కల్పించేందుకు రెవెన్యూ సర్వే వ్యవస్థ బలోపేతం
- ప్రజల సంతృప్తిని దృష్టిలో ఉంచి సర్వేయర్లు నిష్ఠగా పని చేయాలి -మంత్రి పొంగులేటి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వం దీపావళి కానుకగా లైసెన్స్‌డ్ సర్వేయర్ల నియామకాన్ని అందించిందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో సీఎం రేవంత్ రెడ్డి ప్రధాన అతిథిగా పాల్గొని శిక్షణ పొందిన సర్వేయర్లకు లైసెన్సులు పంపిణీ చేసిన కార్యక్రమానికి మంత్రి పొంగులేటి అధ్యక్షత వహించి మాట్లాడారు.
మంత్రి మాట్లాడుతూ.. “దశాబ్దాలుగా రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యలను పరిష్కరించేందుకు ఈ లైసెన్సుల పంపిణీ తొలి అడుగు. గత ప్రభుత్వంలో ధరణి పేరిట జరిగిన తప్పిదాలను సరిదిద్దే క్రమంలో మేము ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఇప్పటివరకు 3,456 మందికి లైసెన్సులు మంజూరు చేశాం” అని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనల మేరకు నిరుద్యోగ యువతకు అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో రెవెన్యూ శాఖలో సర్వే వ్యవస్థను బలోపేతం చేయడానికి నిర్ణయించామని చెప్పారు. “దీనికి 10,000 మంది దరఖాస్తు చేసుకోగా, వారిలో 7,000 మందికి శిక్షణ ఇచ్చాం. ఫీల్డ్ ట్రైనింగ్ పూర్తి చేసిన 3,456 మందిని ఎంపిక చేసి, వారికి ముఖ్యమంత్రి చేతుల మీదుగా లైసెన్సులు అందజేస్తున్నాం” అని మంత్రి వివరించారు.
Also Read
- Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
- Bathukamma : రంగురంగుల పువ్వులతో విరబూసిన మార్కెట్లు.. భగ్గుమంటున్న ధరలు
- RIMS infant Deaths : రిమ్స్‌లో ఐదుగురు శిశువుల మృతి.. ఎలుకలు ఏసీ వైర్లు కొరకడంతోనే ప్రమాదం..
- Uppal T20 Match : ఉప్పల్ టీ20 టికెట్ల గోల్మాల్.. ఆన్లైన్లో సోల్డ్ ఔట్, హెచ్‌సీఏ ఏమంటోంది.?
గత ప్రభుత్వ హయాంలో జీపీవో వ్యవస్థ, భూభారతి, సాదా బైనామాల విషయంలో జరిగిన నిర్లక్ష్యం వల్ల సుమారు 9.80 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని ప్రస్తుత ప్రజా ప్రభుత్వం దశలవారీగా పరిష్కరిస్తోందని ఆయన తెలిపారు. “మీరు ఈ లైసెన్సులు పొందినంత సంతోషంగా ప్రజలు కూడా మీ సేవలతో సంతృప్తి చెందేలా పని చేయాలి. ప్రభుత్వ ప్రతిష్ఠను పెంచే విధంగా, ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని నిజాయితీగా వ్యవహరించాలి” అని మంత్రి పొంగులేటి సర్వేయర్లను పిలుపునిచ్చారు.
తాజావార్తలు
-
Delhi Protest: కన్నాట్ ప్లేస్‌లో హైటెన్షన్.. పోలీసులపై రాళ్లు రువ్విన నిరసనకారులు..!
-
Abhijit Dipke: అరెస్టుకు ముందే వీడియో.. ఉద్యమానికి కొత్త నాయకుడిని ప్రకటించిన అభిజీత్ దీప్కే!
-
Mamata Banerjee: “జానీ జానీ ఎస్ పప్పా.. జ్ఞానేశ్ కుమార్ నో పప్పా!”.. ఢిల్లీలో మమతా బెనర్జీ హల్చల్
-
BC Reservations: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. రేపు పూర్తి జాబితా
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
ట్రెండింగ్
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!