తెలంగాణ రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వం దీపావళి కానుకగా లైసెన్స్‌డ్ సర్వేయర్ల నియామకాన్ని అందించిందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో సీఎం రేవంత్ రెడ్డి ప్రధాన అతిథిగా పాల్గొని శిక్షణ పొందిన సర్వేయర్లకు లైసెన్సులు పంపిణీ చేసిన కార్యక్రమానికి మంత్రి పొంగులేటి అధ్యక్షత వహించి మాట్లాడారు. మంత్రి మాట్లాడుతూ.. “దశాబ్దాలుగా రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యలను పరిష్కరించేందుకు ఈ లైసెన్సుల పంపిణీ తొలి అడుగు.…
నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. సీసీఎల్ ఏలో 217 పోస్టులను మంజూరు చేసింది రేవంత్ సర్కార్. కొత్త 15 రెవెన్యూ మండలల్లో 189 పోస్టులను భర్తీ చేయనున్నారు. కొత్తగా ఏర్పడిన 2 రెవెన్యూ డివిజన్‌ల కోసం 28 పోస్టులు మంజూరు చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు విడుదల చేసింది తెలంగాణ సర్కార్. ఈ పోస్టులను ఆదిలాబాద్ జిల్లా, మహబూబ్‌నగర్, వనపర్తి, కామారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, నల్గొండ, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో భర్తీ చేయనున్నారు. భర్తీ…
Minister Satya Prasad: రాష్ట్రంలో వెలుగు చుసిన నకిలీ ఈ-స్టాంపుల కుంభకోణంపై రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పందించారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ఇటీవల వెలుగులోకి వచ్చిన నకిలీ ఈ-స్టాంపుల వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణలోకి తీసుకున్న మంత్రి, రాష్ట్రవ్యాప్తంగా దీనిపై సమగ్ర విచారణ జరపాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. Read Also:CM Chandrababu: నేడు మూడు జిల్లాల పర్యటనలో సీఎం చంద్రబాబు బిజీ బిజీ..! ఈ నేపథ్యంలో…
జూన్2 న భూమి లేని నిరుపేద రైతులు ఎవరైతే అసైన్డ్ భూములను సేద్యం చేస్తున్నారో వారికి పట్టాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి నిర్ణయించినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. అధికారులతో జరిగిన సమావేశంలో పొంగులేటి కీలక సూచనలు చేశారు. ధరణిలో ఏర్పడ్డ ఇబ్బందులు మళ్ళీ రిపీట్ కావద్దని, ఎట్టి పరిస్థితుల్లో పొరపాట్లు జరగొద్దని తెలిపారు.
పాలకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అత్త ఝాన్సీ రెడ్డికి హైకోర్టు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఝాన్సీరెడ్డితో పాటు ఆమె భర్త రాజేందర్ రెడ్డికి కూడా నోటీసులు జారీ చేసింది. ఝాన్సీ రెడ్డి 2017లో తొర్రూరు మండలం గుర్తూరు గ్రామంలో 75 ఎకరాల భూమిని కొన్నారు. ఫెమా నిబంధనలను ఉల్లంఘించి భూమి కొనుగోలు చేసిందని దామోదర్ రెడ్డి అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు.
Big Breaking : తెలంగాణ భూ భారతి అనేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఒక ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం, దీని ప్రయోజనం రాష్ట్రంలో భూ నిర్వహణను సమర్థవంతంగా నిర్వహించడం , రైతులకు, పర్యావరణానికి అనుకూలంగా భూముల వినియోగాన్ని ప్రోత్సహించడం. ఈ కార్యక్రమం, తెలంగాణలో భూముల రిజిస్ట్రేషన్, భూమి చట్టాలు, ఆస్తి హక్కుల పునరుద్ధరణ వంటి ముఖ్యమైన అంశాలను కవర్ చేస్తుంది. భూ భారతి కార్యక్రమం ద్వారా, ప్రభుత్వమే భూముల ఖాతాలు, రికార్డులను సరికొత్తగా సృష్టించి వాటి మాలికల…
Bhu Bharati : భూ సమస్యల పరిష్కారం, లావాదేవీలకు సంబంధించిన సమాచారం రైతులకు, ప్రజలకు సులభంగా, వేగంగా అందబాటులో ఉండేలా భూ భారతి పోర్టల్ ఉంటుందని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి తెలిపారు. భూ భారతిని సోమవారం ప్రారంభించనున్న నేపథ్యంలో తన నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. భూ భారతి ప్రారంభోత్సవం అనంతరం తెలంగాణలోని మూడు మండలాలను పైలెట్ ప్రాజెక్టులుగా ఎంపిక…
Registrations : రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు మరింత వేగవంతంగా, పారదర్శకంగా, అవినీతిరహితంగా సేవలు అందించేందుకు సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల ఆధునీకరణ కొనసాగుతున్నదని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా, డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ కోసం గంటల తరబడి వేచిచూడాల్సిన అవసరం లేకుండా, కేవలం 10–15 నిమిషాల్లో రిజిస్ట్రేషన్ పూర్తయ్యేలా స్లాట్ బుకింగ్ విధానాన్ని రాష్ట్రంలో ప్రవేశపెడుతున్నామని ప్రకటించారు. మొదటి దశగా రాష్ట్రంలోని 144 సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల్లో 22 కార్యాలయాల్లో ఈ విధానం ఏప్రిల్ 10 నుంచి అమల్లోకి…
చిత్తూరు జిల్లా మంగళంపేట పరిధిలో మాజీమంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూ ఆక్రమణలపై ఏర్పాటు చేసిన అటవీ, రెవెన్యూ శాఖల అధికారులతో సంయుక్త కమిటీ విచారణ ప్రారంభించింది.. కమిటీలో సభ్యులైన చిత్తూరు కలెక్టర్ మంగళంపేట పరిధిలో పెద్దిరెడ్డి ఆక్రమించారని భావిస్తున్న 295, 296 సర్వే నెంబర్లలోని భూములకు సంబంధించిన పాత దస్త్రాలను పరిశీలించారు.
Ration Card Verification : తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియను వేగవంతం చేస్తోంది. ఇటీవల కొత్త రేషన్ కార్డుల జారీకి సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసిన విషయం తెలిసిందే. ప్రత్యేకంగా హైదరాబాద్ నగరంలో కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను మరింత దృష్టిలో పెట్టుకుని, జీహెచ్ఎంసీ (GHMC) అధికారులు రంగంలోకి దిగారు. జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి నేతృత్వంలో 150 డివిజన్లలో దరఖాస్తుదారుల అర్హతల పరిశీలన ప్రారంభమైంది. జీహెచ్ఎంసీ పరిధిలో రేషన్ కార్డుల…