CM Chandrababu : ఏపీలో పోలీసులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..
- 1,650 మంది పోలీసు అధికారులతో సీఎం భారీ సమీక్ష
- మహిళలు, చిన్నారులపై నేరాల కట్టడికి ఆదేశాలు
- సైబర్ క్రైమ్, గంజాయి ముఠాలపై ఉక్కుపాదం
- ఫేక్ ప్రచారాలపై ముందస్తు చర్యలకు సూచన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర సచివాలయం నుంచి అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో హోం మంత్రి అనిత, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా , ఇతర ఉన్నతాధికారులు నేరుగా పాల్గొనగా, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రేంజ్ ఐజీలు, డీఐజీలు, జిల్లాల ఎస్పీలు, డీఎస్పీలు, ఇన్స్పెక్టర్లు , ఎస్ఐలు వర్చువల్ విధానంలో హాజరయ్యారు. మొత్తం 1,200కు పైగా పోలీస్ స్టేషన్ల నుంచి స్టేషన్ హౌస్ ఆఫీసర్లు (SHOs) సహా దాదాపు 1,650 మంది అధికారులు ఒకేసారి ఈ వర్చువల్ సమావేశంలో పాలుపంచుకోవడం విశేషం. ఈ సందర్భంగా క్షేత్రస్థాయి నుంచి ఉన్నతాధికారుల వరకు అందరికీ రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ స్టేషన్ల పనితీరు, కేసులు నమోదు చేసే తీరు , ప్రజలకు వేగంగా న్యాయం అందించే ప్రక్రియపై సీఎం దిశా నిర్దేశం చేశారు.
నేరాల కట్టడికి కఠిన ఆదేశాలు
రాష్ట్రంలో మహిళలు, చిన్నారులపై జరుగుతున్న నేరాల నియంత్రణతో పాటు సైబర్ క్రైమ్స్, బ్లేడ్ బ్యాచ్‌లు, గంజాయి ముఠాల ఆగడాలకు శాశ్వతంగా అడ్డుకట్ట వేయాలని ముఖ్యమంత్రి పోలీసు యంత్రాంగాన్ని కఠినంగా ఆదేశించారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ఫేక్ ప్రచారాలను అరికట్టేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదవుతున్న కేసుల పురోగతిని సమీక్షిస్తూ, సమాజంలో భయాందోళనలు సృష్టిస్తూ చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారిపై ఎలాంటి దాక్షిణ్యం లేకుండా కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ కొనసాగిస్తూనే నేరస్థుల పట్ల సింహస్వప్నంగా వ్యవహరించాలని, రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడటంలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించేది లేదని సీఎం రేవంత్ తరహాలోనే ఉన్నతాధికారులను హెచ్చరించారు.
Also Read
- Ganesh Mandapam: వినాయక మండపాలపై కీలక ఆదేశాలు.. ఇవి తప్పనిసరిగా పాటించాల్సిందే..
- New ZPs: ఏపీలో జిల్లా పరిషత్‌ల పునర్వ్యవస్థీకరణ.. 13 నుండి 28కి పెరిగిన కొత్త జెడ్పీలు..
- Paper Mill: గోదావరి కాలుష్యంపై ఏపీ పేపర్ మిల్లుకు నోటీసులు: కలెక్టర్ కీర్తి చేకూరి
- AP Employees: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన సీఎం చంద్రబాబు.. ఒకేసారి రెండు డీఏలు..
తాజావార్తలు
-
BLA Attack: పాక్ సైన్యంపై BLA మెరుపుదాడి.. 25 మంది సైనికులు హతం..
-
Sardar 2: ‘స్పైడర్’లో మిస్సైన మ్యాజిక్ ఇందులో రిపీట్.. కార్తి షాకింగ్ కామెంట్స్!
-
Secunderabad Army : ఆర్మీ ఆయుధాల మిస్సింగ్ కేసు.. ఐదు రోజులు గడిచినా మిస్టరీనే.!
-
Moscow: యుద్ధం ముగింపు దిశగా అడుగులు.. మాస్కోలో ట్రంప్ దూతలు చర్చలు.. పుతిన్ మెత్తబడతారా?
-
Jhiram Ghati Maoist Attack: ‘‘జీరాం ఘాటి’’ కాంగ్రెస్ నేతల దారుణహత్య.. 10 మంది దోషుల నిర్ధారణ..
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!