తెలంగాణలో విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఇంటర్ బోర్డ్ ఎగ్జామ్స్ ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఉదయం 11 గంటలకు ఈ ఫలితాలను ప్రకటించేందుకు అన్ని ఏర్పాట్లు సిద్దం చేశారు. రాష్ట్రంలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు మే 6 నుంచి 24 వరకు నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే.. సుమారు 9 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. ఈ ఫలితాలను https://tsbie.cgg.gov.in, https://results.cgg.gov.in, https:// examresults.ts.nic.in వెబ్‌సైట్లలో చూడవచ్చని అధికారులు తెలిపారు. కాగా.. షెడ్యూల్ ప్రకారం మే 6 నుంచి 23 వరకు తెలంగాణలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్, ఇంటర్ సెంకడ్ ఇయర్ పరీక్షలను మే 7 నుంచి 24వ తేదీ వరకు నిర్వహించారు.
అయితే ఈఏడాది తెలంగాణలో ఇంటర్ పరీక్షలకు మొత్తం 9,07,396 మంది హాజరయ్యారు. ఈ పరీక్షల్లో ఫస్టియర్ పరీక్షలకు 4,64,626 మంది హాజరవ్వగా.. సెకండియర్ పరీక్షలు 4,42,768 మంది రాయగా.. మొత్తం 1,443 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసి , 25 వేల మంది ఇన్విజిలేటర్లు, 150 మంది సిట్టింగ్ స్క్వాడ్, 75 మంది ఫ్లయింగ్ స్క్వాడ్‌లతో పరీక్షలు పటిష్టంగా నిర్వహించారు. అయితే ఇంటర్ ఫలితాలను తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నేడు ఉదయం 11 గంటలకు ఫలితాలు విడుదల చేయనున్నారు.
LIVE : నేడు ఇంటిల్లిపాది హనుమాన్ చాలీసా వింటే అష్టైశ్వర్యాలే