TG Inter Admissions: తెలంగాణలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశాల గడువును మరొకసారి పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు (TGBIE). 2025–26 విద్యా సంవత్సరానికి ఈ ప్రవేశాల గడువు ఆగస్టు 20, 2025 వరకు పెంచినట్లు బోర్డు తాజాగా ప్రకటించింది. ఇంటర్ బోర్డు ప్రకారం, ఇది చివరి సారిగా ఇవ్వబోయే గడువుగా పేర్కొంది. ప్రవేశాల గడువుకు ఇది తుది అవకాశమని, ఆ తర్వాత గడువును మళ్లీ పెంచే అవకాశం లేదని బోర్డు స్పష్టం…
తెలంగాణ ఇంటర్ పరీక్ష తేదీలను ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది. మార్చి 5 నుంచి 25 వరకు ఇంటర్ పరీక్షలను నిర్వహించనున్నట్లు బోర్డు వెల్లడించింది. ఫిబ్రవరి 3 నుంచి 22 వరకు ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జరగనున్నాయి.
TS Inter Exams 2024: తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. అయితే పరీక్ష కేంద్రానికి ఒక్కనిమిషం ఆలస్యమైనా కేంద్రంలోకి అనుమతించడం లేదు.
ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారి.. విద్యావ్యవస్థలో అనేక మార్పులకు కారణమైంది.. కొన్నిసార్లు అసలు పరీక్షలు లేకుండానే పాస్ చేయాల్సిన పరిస్థితి తెచ్చింది.. స్కూల్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఆన్‌లైన్ క్లాస్‌ల పేరుతో ఇంట్లోనే కూర్చొబెట్టింది.. ఇక, సిలబస్‌ను తగ్గించడం.. పరీక్షల్లో ఆప్షన్‌గా ప్రశ్నలు పెంచడం.. ఇలా అనేక మార్పులు వచ్చాయి.. కానీ, ఇప్పుడు మహమ్మారి పోయి సాధారణ పరిస్థితులు వచ్చిన నేపథ్యంలో.. తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఈఏడాది నుంచి మళ్లీ పూర్తి…
తెలంగాణలో విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఇంటర్ బోర్డ్ ఎగ్జామ్స్ ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఉదయం 11 గంటలకు ఈ ఫలితాలను ప్రకటించేందుకు అన్ని ఏర్పాట్లు సిద్దం చేశారు. రాష్ట్రంలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు మే 6 నుంచి 24 వరకు నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే.. సుమారు 9 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. ఈ ఫలితాలను https://tsbie.cgg.gov.in, https://results.cgg.gov.in, https:// examresults.ts.nic.in…
ఇంటర్మీడియట్ విద్యార్థులకు మార్చిలో ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నారు. గత సంవత్సరం, కోవిడ్-19 మహమ్మారి పరిస్థితి కారణంగా, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఒకేషనల్ విద్యార్థులకు హోమ్ ఆధారిత అసైన్‌మెంట్‌లుగా ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించబడ్డాయి. సాధారణ స్ట్రీమ్‌ల విద్యార్థులకు పూర్తి మార్కులు ఇవ్వబడ్డాయి. ఇప్పుడు విద్యార్థులు తమ కళాశాలల్లోనే ప్రాక్టికల్ పరీక్షలకు హాజరుకావాల్సి ఉంది. “ఇప్పుడు ఫిజికల్ క్లాసుల కోసం కాలేజీలు తిరిగి తెరవబడినందున, సంబంధిత కాలేజీల్లో ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించబడతాయి. ఈ ఏడాది మొత్తం సిలబస్‌లో 70 శాతం…
తెలంగాణలో 26 ప్రైవేట్ జూనియర్ కాలేజీల భవితవ్యం అయోమయంగా మారింది. ఈ కాలేజీల్లో జాయినైన విద్యార్థుల పరిస్థితి గందరగోళంలో పడింది. కాలేజీల షిఫ్టింగ్ కు నోటిఫికేషన్ వేసి ఇంటర్‌బోర్డు.. దరఖాస్తులు తీసుకుంది. అయితే 3 నెలలుగా దరఖాస్తులను పెండింగ్‌లో పెట్టిన విద్యాశాఖ.. చివరకు అనుమతివ్వలేదు. షిఫ్టింగ్‌కు అనుమతి వస్తుంది అన్న ధీమాతో.. కొత్త ప్లేసులో కాలేజీలు అడ్మిషన్ తీసుకున్నాయి. అయితే, ఆ బిల్డింగ్‌ల ఫైర్ ఎన్‌వోసీల సమస్య ఇంకా కొలిక్కి రాలేదు. ఎన్‌వోసీ వస్తే తప్ప అనుబంధ…
ఇంటర్ ప్రవేశాలకు షెడ్యూల్ విడుదల చేసింది తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు.. ఇవాళ్టి నుంచి జులై 5వ తేదీ వరకు ప్రవేశాలకు అనుమతి ఇచ్చింది… జూన్ 1 నుంచి ఇంటర్ ఫస్టియర్ ఆన్‌లైన్ తరగతులు ప్రారంభం కానున్నాయి. ఇంటర్నెట్ మార్కుల మెమోల ఆధారంగా ప్రాథమిక ప్రవేశాలు చేసుకోవాల్సిందిగా ఇంటర్‌బోర్డు సూచించింది. అనంతరం ఎస్ఎస్‌సీ పాస్ సర్టిఫికేట్, టీసీ, స్టడీ సర్టిఫికెట్ల ఆధారంగా ప్రవేశాలను ధ్రువీకరించాలని పేర్కొంది. ఇక, 10వ తరగతిలో వచ్చిన గ్రేడ్స్ ను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని..…