Telangana : గ్రేటర్ హైదరాబాద్ శివార్లలోని తొర్రూర్ గ్రామంలో రియల్ ఎస్టేట్ మార్కెట్ రికార్డు ధరలను తాకింది. అవుటర్ రింగ్ రోడ్డుకు దగ్గరగా ఉన్న ఈ ప్రాంతంలో రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఓపెన్ ప్లాట్ల బహిరంగ వేలంలో చదరపు గజం భూమి ధర రూ.67,500 పలికింది. మధ్యతరగతి కుటుంబాలకు అనువైన 300 నుంచి 450 గజాల విస్తీర్ణంలోని 100 ప్లాట్ల వేలం అబ్దుల్లాపూర్‌మెట్‌లో జరిగింది. ఈ వేలంలో 240 మంది కొనుగోలుదారులు పాల్గొన్నారు. చదరపు గజానికి కనీస ధర రూ.25,000గా నిర్ణయించగా, ఒక కార్నర్ ప్లాట్‌కు తీవ్రమైన పోటీ నెలకొంది. ఈ ప్లాట్‌ను చివరకు రూ.67,500కి విక్రయించారు.
Mohan Bhagwat: విద్య, ఆరోగ్యం సామాన్యుడికి దూరమయ్యాయి. మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
ఈ లేఅవుట్‌లో మొత్తం 24 కార్నర్ ప్లాట్లు ఉన్నాయి. మరో ప్లాట్ ధర చదరపు గజానికి రూ.62,000 పలికింది. ఈ వంద ప్లాట్ల సగటు ధర రూ.33,000గా నమోదైంది. ఈ విక్రయాల ద్వారా రాజీవ్ స్వగృహ కార్పొరేషన్‌కు సుమారు రూ.105 కోట్ల ఆదాయం సమకూరింది. ఈ వేలం ప్రక్రియ ఆదివారం ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయేంత వరకు భారీ పోలీసు బందోబస్తు, రెవెన్యూ, రాజీవ్ స్వగృహ, హెచ్‌ఎండిఎ అధికారుల పర్యవేక్షణలో నిర్వహించబడింది. చాలా మంది తమ కుటుంబాలతో కలిసి వచ్చి, తమకు నచ్చిన ప్లాట్లను సొంతం చేసుకోవడానికి పోటీపడ్డారు.
Elumalai Movie: ‘ఏలుమలై’ సినిమా నుంచి కొత్త పాట.. ‘కాపాడు దేవా’ అంటున్న మంగ్లీ