Telangana : గ్రేటర్ హైదరాబాద్ శివార్లలోని తొర్రూర్ గ్రామంలో రియల్ ఎస్టేట్ మార్కెట్ రికార్డు ధరలను తాకింది. అవుటర్ రింగ్ రోడ్డుకు దగ్గరగా ఉన్న ఈ ప్రాంతంలో రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఓపెన్ ప్లాట్ల బహిరంగ వేలంలో చదరపు గజం భూమి ధర రూ.67,500 పలికింది. మధ్యతరగతి కుటుంబాలకు అనువైన 300 నుంచి 450 గజాల విస్తీర్ణంలోని 100 ప్లాట్ల వేలం అబ్దుల్లాపూర్‌మెట్‌లో జరిగింది. ఈ వేలంలో 240 మంది కొనుగోలుదారులు పాల్గొన్నారు. చదరపు…