HYDRA : శంషాబాద్ లో సోమవారం ఉదయం హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని సంపత్ నగర్, ఊట్పల్లి లో అక్రమంగా నిర్మించిన నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. సంపత్ నగర్ లో ప్రభుత్వ భూమి ఆక్రమించి కబ్జా చేసిన కట్టడాలను, ఊట్పల్లి లో రోడ్డు ఆక్రమించి అడ్డంగా గేటు ఏర్పాటు చేయడంతో రెండిటిని హైడ్రా అధికారులు కూల్చివేశారు. ఉదయం నుంచి కూల్చివేతలు కొనసాగాయి. ప్రభుత్వ భూములు, నాళాలు, చెరువులు, పార్కు స్థలాలు…
AV Ranganath : అయ్యప్ప సొసైటీ కూల్చివేత లపై హైడ్రా కమిషనర్ రంగనాధ్ ప్రకటన విడుదల చేశారు. అయ్యప్ప సొసైటీలో అక్రమ భవనాన్ని కూల్చివేయాలని జీహెచ్‌ఎంసీని హైకోర్టు ఆదేశించిందని ఆయన తెలిపారు. గతంలో స్లాబ్‌పై కొన్ని రంధ్రాలు చేయబడ్డాయని, బిల్డర్ రంధ్రాలను మూసివేసి 7 అంతస్తుల అక్రమ నిర్మాణానికి ముందుకొచ్చాడన్నారు. హైకోర్టులో ధిక్కార పిటిషన్ కూడా దాఖలైంది, విచారణలో ఉందని ఆయన తెలిపారు. అయ్యప్ప సొసైటీలో దాదాపు అన్ని నిర్మాణాలు చట్టవిరుద్ధమని, ప్రస్తుతం కూల్చివేసిన భవనాన్ని అక్రమంగా…
HYDRA: హైదరాబాద్ డిసాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (HYDRA) నేడు (ఆదివారం) మాదాపూర్‌లో అనుమతులు లేకుండా నిర్మాణం చేపట్టిన 6 అంతస్తుల భారీ భవనాన్ని కూల్చివేసేందుకు సిద్ధమవుతోంది. మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో సెట్ బ్యాక్ నిబంధనలు పాటించకుండా నిర్మించబడుతున్న ఈ భవనం అనుమతులు లేకుండా నిర్మాణం చేపట్టడంతో, హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆధ్వర్యంలో చర్యలు ప్రారంభమయ్యాయి. స్థానికులు ఈ అక్రమ నిర్మాణంపై పలుమార్లు ఫిర్యాదులు చేయడంతో హైడ్రా అధికారులు రంగంలోకి దిగింది. ఫీల్డ్ విజిట్…
జీహెచ్ఎంసీ పరిధిలో అక్రమనిర్మాణాలపై హైకోర్టు విచారణ జరిపింది. కోర్టు స్టేలు ఎత్తివేయాలని జీహెచ్ఎంసీ ఎందుకు కోరడం లేదన్న హైకోర్టు… అక్రమ నిర్మాణం పూర్తయ్యే వరకు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారన్నారు. జీహెచ్ఎంసీలోనే సుమారు లక్ష అక్రమ నిర్మాణాలున్నాయన్న హైకోర్టు… రాష్ట్రవ్యాప్తంగా అక్రమ నిర్మాణాల పరిస్థితి ఏమిటని కాగితాల్లో నిబంధనలు బాగున్నప్పటికీ క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. అక్రమ నిర్మాణాలపై తీసుకున్న చర్యలు నివేదించని జోనల్ కమిషనర్లపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. నివేదికలు సమర్పించని అధికారులు ఖర్చుల…