CM KCR: మంత్రైనా, ముఖ్యమంత్రి అయినా డాక్టర్ల ముందు చేయి చూపాల్సిందే అని సీఎం కేసీఆర్ అన్నారు. నేడు నిమ్స్ కొత్త బ్లాక్ నిర్మాణానికి ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేశారు. హైదరాబాద్‌లోని ఎర్రమంజిల్‌లో దసాబ్ది బ్లాక్ పేరుతో నిమ్స్ ఆస్పత్రి భవనాలకు సీఎం కేసీఆర్ భూమిపూజ చేశారు. అప్పుచ్చు వాడు ఉండాలి… వైద్యులు ఉండాలని గతంలో కవులు చెప్పారని గుర్తు చేశారు. మానవజాతి ఉన్నంత కాలం వైద్యులు ఉంటారని అన్నారు. 2014లో తెలంగాణ కోసం నిధుల కేటాయింపు 2100 కోట్లు, 2023-24లో 12365 కోట్ల బడ్జెట్ అని సీఎం తెలిపారు. 17 వేల పడకల నుంచి 50 వేల బెడ్లు ఏర్పాటు చేసుకుంటున్నామన్నారు. 50 వేల ఆక్సిజన్ బెడ్లు ఏర్పాటు చేసుకుంటున్నామన్నారు.
Read also: Kabali Producer KP Chowdary: టాలీవుడ్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం.. ‘కబాలి’ నిర్మాత అరెస్ట్
మన రాష్ట్రంలో మిడతలు బెడద లేదని గుర్తు చేసుకున్నారు. ఆదిలాబాద్ బార్డర్ వరకు మిడతలు వచ్చాయి.. అందుకు సర్వం సిద్ధం చేశామని తెలిపారు. కేంద్రం నుంచి ఇద్దరు ఎంటమాలజిస్టిలు వచ్చారని, 8 లక్షల సంవత్సరాల ముందే ముడుతలు, బ్యాక్టీరియలు పుట్టాయని తెలిపారు. రాబోయే రోజుల్లో కరోన మించిన వైరస్ లు వస్తాయని చెప్పారని అన్నారు. హెల్త్ సిస్టం మంచిగా ఉన్న దగ్గర ప్రమాద తీవ్రత తక్కువగా ఉంటుందని తలిపారు. హెల్త్ సిస్టమ్ సక్రమంగా లేని దగ్గర ఎక్కువ ప్రమాద తీవ్రత ఉంటుందని చెప్పారు. బిడ్డల పెరుగుదలల్లో ఎలాంటి లోపం ఉంటే వంద సంవత్సరాలు ఇబ్బందులు ఎదుర్కొంటారు.. అలా ఉండొద్దని న్యూట్రిషన్ కిట్లు పంపిణీ చేస్తున్నామని సీఎం కేసీఆర్ పేర్కొ్న్నారు. వైద్య ఆరోగ్య రంగంలో చాలా మార్పులు రావాలని అన్నారు. వైద్య ఆరోగ్య రంగానికి పౌర సంబంధాలు తక్కువ అని అన్నారు. వైద్యులను విమర్శించే వాళ్ళు ఎక్కువ… ప్రోత్సహించే వాళ్ళు తక్కువని సీఎం పేర్కొన్నారు.
Read also: Vikarabad Sireesha Case: అనుమానమే నిజమైంది.. నాలుగు రోజులకు వీడిన శిరీష మిస్టరీ కేసు
అందరు మానవీయ కోణంలో ఆలోచించాలని కేసీఆర్ తెలిపారు. మంత్రైనా, ముఖ్యమంత్రి అయినా డాక్టర్ల ముందు చేయి చూపాల్సిందే అని సీఎం అన్నారు. తెలంగాణ పోలీస్ ఫ్రెండ్లీ పోలీస్ అంటూ పొగడ్తలతో ముంచెత్తారు. వైద్య ఆరోగ్య శాఖ పీఆర్ పెరగాలి.. వైద్య శాఖ ప్రజల కోసం ఏం చేస్తుందో తెలియాలని సీఎం పేర్కొన్నారు. కేసీఆర్ కిట్ ద్వారా ఎంతో మంది ప్రాణాలు కాపాడుతున్నామని తెలిపారు. హెల్త్ డిపార్ట్మెంట్ ప్లానింగ్ బాగుండాలని అన్నారు. ఆసుపత్రుల నిర్మాణాలే కాదు.. ఆసుపత్రుల్లో సేవలు కూడా పెరగాలని సీఎం తెలిపారు. వైద్య శాఖ కాపాడుతుందని ధీమా కల్పించాలని సూచించారు. కరోన సమయంలో గాంధీ ఆసుపత్రిలో రోగులకు అందించిన సేవలకు గాంధీ వైద్యులకు శిరస్సు వంచి నమస్కారాలు చెబుతున్నా అని సీఎం కేసీఆర్ అన్నారు.
Upasana konidela :పుట్టబోయే బిడ్డ కోసం సంచలన నిర్ణయం తీసుకున్న ఉపాసన?