Telangana Excise: ఖజానాకు లిక్కర్ కిక్కు..తగ్గేదెలే అంటున్న మందుబాబులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రభుత్వాల ఖజానాకు మద్యానికి మించిన కిక్ మరొకటి లేదంటే అతిశయోక్తి కాదేమో. తెలుగు రాష్ట్రాల్లో అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణ రాష్ట్రాల ఖజానాలకు ఆరు బీర్లు-మూడు విస్కీ బాటిళ్ళలాగా వర్థిల్లుతున్నాయి. తెలంగాణలో మద్యం కిక్ తో ఖజానా గలగలమంటోంది. రికార్డ్ స్థాయిలో మద్యం అమ్మకాలు జరిగాయని తెలంగాణ ఎక్సైజ్ అధికారులు తెలిపారు. గురువారం ఒక్క రోజే రూ.303 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయంటే పరిస్థితి ఎలా వుందో అర్థం చేసుకోవచ్చు. తెలంగాణలో ప్రస్తుతం 2,620 వైన్స్‌తో పాటు వెయ్యికి పైగా బార్లు, క్లబ్బులు, టూరిజం హోటళ్లున్నాయి. మద్యం అమ్మకాల్లో గ్రేటర్ హైదరాబాద్ జిల్లాల్లోనే వాటా ఎక్కువ ఉంది. రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల్లోనే రూ.10 వేల కోట్లకు పైగా అమ్మకాలు
ఈ ఆర్థిక సంవత్సరం లో డిపోల నుండి 2021-22లో మద్యం అమ్మకాలు రూ.30 వేల 780 కోట్లు జరిగాయి. మార్చి నెలలో రూ.2 వేల 810 కోట్లు జరిగాయని అధికారులు తెలిపారు. ఈ ఏడాదితో పోలిస్తే గత ఏడాది అమ్మకాలు మూడువేల వరకూ తక్కువగా నమోదయ్యాయి. 2020-21లో మద్యం అమ్మకాలు 27,289 కోట్లుగా నమోదయ్యాయి. ఏ విధంగా చూసినా నెలకు రూ.2500 కోట్ల నుంచి 3 వేల కోట్ల వరకూ అమ్మకాలు సాగుతున్నాయి. అంటే రోజుకి సరాపరి 100 కోట్ల వరకూ మద్యం తాగేస్తున్నారు.
Also Read
- Chanchalguda Jail : చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు.. జైళ్ల శాఖ క్లారిటీ
- Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
- Telangana Rain Alert: తెలంగాణలో వాన మోత.. ఈ జిల్లాలకు పిడుగుల ముప్పు
- DK Aruna : ఓటమి భయంతోనే కాంగ్రెస్ డ్రామాలు.. ఎంపీ డీకే అరుణ కీలక వ్యాఖ్యలు..
పండగలు, పబ్బాలు వచ్చాయంటే మద్యం తాగేవారి సంఖ్య పెరుగుతోంది. అందులోనూ సమ్మర్ ప్రారంభం కావడంతో బీర్ల అమ్మకాలు బాగా పెరిగాయి. అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో రూ.6,700 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయని అధికారులు చెబుతున్నారు. ఇవాళ్టి నుంచి ప్రారంభమయిన ఆర్థిక సంవత్సరంలో 4 వేల కోట్లు అదనంగా రాబట్టేందుకు సర్కారు లక్ష్యం నిర్దేశించింది. టాక్స్ పేయర్స్ పైనే ప్రభుత్వాలు ఆధారపడుతున్నాయి. దీనికి తోడు డ్రంక్ అండ డ్రైవ్ అంటూ తనిఖీలు చేపట్టి పోలీసులు అదనంగా లాగేస్తున్నారు. దీనిని బట్టి చూస్తే మందుబాబులే ప్రభుత్వాలకు మహారాజపోషకులు అవుతున్నారు.
తాజావార్తలు
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
-
Chanchalguda Jail : చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు.. జైళ్ల శాఖ క్లారిటీ
-
Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ ‘విరాట్ గర్జన’.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!