ప్రభుత్వాల ఖజానాకు మద్యానికి మించిన కిక్ మరొకటి లేదంటే అతిశయోక్తి కాదేమో. తెలుగు రాష్ట్రాల్లో అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణ రాష్ట్రాల ఖజానాలకు ఆరు బీర్లు-మూడు విస్కీ బాటిళ్ళలాగా వర్థిల్లుతున్నాయి. తెలంగాణలో మద్యం కిక్ తో ఖజానా గలగలమంటోంది. రికార్డ్ స్థాయిలో మద్యం అమ్మకాలు జరిగాయని తెలంగాణ ఎక్సైజ్ అధికారులు తెలిపారు. గురువారం ఒక్క రోజే రూ.303 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయంటే పరిస్థితి ఎలా వుందో అర్థం చేసుకోవచ్చు. తెలంగాణలో ప్రస్తుతం 2,620 వైన్స్‌తో పాటు…