Hyderabad City Bus: బస్సుల్లో ప్రయాణిస్తే తక్కువ డబ్బుతో ప్రయాణం చేయవచ్చని సామాన్య ప్రయాణికులు భావిస్తున్నారు. సాధారణంగా హైదరాబాద్ నగరంలో సిటి బస్సు ఎక్కితే, టిక్కెట్ ధర రూ. 20 నుంచి గరిష్టంగా 80 రూపాయలు ఉంటుంది. దీంతో తక్కువ ఖర్చుతో ఎక్కువ సమయం పట్టిన సేఫ్ గా చేరుకోవచ్చని ప్రజలు బస్సులను ఆశ్రయిస్తారు. అయితే ఇటివల బస్సు ఎక్కిన ఓ ప్రయాణికుడికి కండక్టర్ ఇచ్చిన టికెట్ చూసి షాక్ అయ్యాడు. ఎందుకంటే కండక్టర్ అతనికి రూ.100 లేక 200 వందలో కాదండోయ్.. ఏకంగా రూ.29,210 ఒక్క టికెట్ ఇచ్చాడు. అది చూసి ప్రయాణికుడు గుండె ఆగినంత పని అయ్యింది. అతను సిటీ బస్సులో వెళ్తున్నాడా? లేక ఎయిర్ బస్ లోనా? అని ఒకటికి రెండు సార్లు చెక్ చేశాడు. గిల్లీ తనను తాను చూసుకున్నాడు. చివరకు సిటీ ఆర్డినరీ బస్సులో ప్రయాణిస్తున్నానని కన్ఫర్మ్ చేసుకున్నాడు. ఇది సరే మరి ప్రయాణికుడి నుంచి 29,210 రూపాయల టిక్కెట్టుకు కండక్టర్ ఎంత వసూలు చేశాడు? ఈ ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది.
Read also: Northern Railway: మసీదులకు రైల్వే అధికారుల నోటీసులు .. 15 రోజుల్లోగా ఆక్రమణలను తొలగించాలి
రాణిగంజ్‌డిపో రూట్‌పేరు. బస్సు నెంబర్ 219. గురువారం సాయంత్రం ఇస్నాపూర్ నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న బస్సులో ఓ వ్యక్తి ఎక్కాడు. కండక్టర్‌ని బాలానగర్ కూడలికి టికెట్ అడిగాడు. రాణిగంజ్ డిపోకు చెందిన బస్ కండక్టర్ టికెట్ ఇచ్చాడు. రూ.20, రూ.25 ఇస్తానని భావించి రూ.29,210 టిక్కెట్ ఇచ్చాడు. చేతిలో టిక్కెట్టు పట్టుకున్న ప్రయాణికుడు కండక్టర్ వైపు ప్రశ్నార్థకంగా చూశాడు. అది చూసి మిషన్‌లో సాఫ్ట్‌వేర్ సమస్య వచ్చిందని చెప్పారు. ఈ సమస్య తమ దృష్టికి రావడంతో సాంకేతిక లోపాన్ని సరిచేశామని రాణిగంజ్ డిపో మేనేజర్ లక్ష్మీ ధర్మ తెలిపారు. దీంతో వివాదం కాస్త సద్దుమణిగింది. చూసారా సాఫ్ట్‌వేర్ కూడా ఎల్లప్పుడూ సరిగ్గా పని చేయదని గుర్తుంచుకోండి. పూర్తిగా ఆధారపడిన వ్యక్తులను గుడ్డిగా నమ్మవద్దు. గతంలో కూడా డి మార్ట్ బిల్లులపై వివాదాలు చోటుచేసుకున్నాయి. కాబట్టి ప్రజలు తమ బిల్లులను ఒకటికి రెండుసార్లు సరిచూసుకోవాలి.
Rebal Star: సలార్ ని బీట్ చేయడం కల్కీ వల్ల కూడా కాలేదు