రెబల్ స్టార్ ప్రభాస్ దెబ్బకు సోషల్ మీడియా దద్దరిల్లిపోతోంది. టాలీవుడ్ టు హాలీవుడ్ వయా బాలీవుడ్ తన మార్కెట్ ని పెంచుతూ వెళ్లిన ప్రభాస్ మరి కొన్ని రోజుల్లో ఫేస్ ఆఫ్ ఇండియన్ సినిమాగా మారే అవకాశం ఉంది. బాక్సాఫీస్ రికార్డులే కాదు డిజిటల్ రికార్డ్స్ విషయంలో కూడా ప్రభాస్ పాత రికార్డుల బూజు దులిపి కొత్తగా రాస్తున్నాడు. సాహో, ఆదిపురుష్ సినిమాల టీజర్ లతో 100 మిలియన్ వ్యూస్ రాబట్టిన ప్రభాస్, రీసెంట్ గా సలార్ గ్లిమ్ప్స్ తో 100 మిలియన్ వ్యూస్ రాబట్టి ఇండియాలోనే అత్యధిక డిజిటల్ రికార్డ్స్ ఉన్న హీరోగా హిస్టరీ క్రియేట్ చేసాడు. ప్రభాస్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న సలార్ సినిమా గ్లిమ్ప్స్ రిలీజైన 24 గంటల్లోనే 83 మిలియన్ల వ్యూస్ అందుకుని ప్రభాస్ రేంజ్ ఏంటో తెలిసేలా చేసింది. అంతేకాదు.. రెండు రోజుల్లోనే 100 మిలియన్ల వ్యూస్ రాబట్టి.. ఫాస్టెస్ట్ 100 మిలియన్స్ వ్యూస్ రాబట్టిన టీజర్‌గా సలార్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ప్రభాస్ మొహం కూడా కనిపించని టీజర్‌కె ఇలా ఉంటే.. ప్రాజెక్ట్ K, గ్లిమ్ప్స్ రివీల్ కి ఇంకెలా ఉంటుందో అని అందరూ అనుకున్నారు.
ప్రాజెక్ట్ కె ఇకపై ‘కల్కి 2898ఏడీ’ అంటూ టైటిల్ ని అనౌన్స్ చేసిన మేకర్స్, ఒక గ్లిమ్ప్స్ ని కూడా రిలీజ్ చేసారు. హ్యూజ్ టెక్నీకల్ సెటప్, సూపర్బ్ బ్యాక్ డ్రాప్, ఒక కొత్త ప్రపంచం ఉండడంతో కల్కి గ్లిమ్ప్స్ సలార్ వ్యూస్ ని బ్రేక్ చేస్తుందనుకున్నారు కానీ సలార్ దరిదాపుల్లోకి కూడా రాలేదు కల్కి గ్లింప్స్. 24 గంటల్లో కనీసం 12 మిలియన్స్ వ్యూస్ కూడా రాబట్టలేకపోయింది. ప్రాజెక్ట్ కె పై భారీ అంచనాలున్నప్పటికీ.. వ్యూస్ పరంగా సలార్‌ను టచ్ చేయడం కష్టమే. దీనికి కారణం సలార్ మాస్ సబ్జెక్ట్ కావడం, ప్రశాంత్ నీల్ డైరెక్టర్ అవడం, ప్రభాస్ రెబల్ స్టార్ అనే తన బిరుదుకి పర్ఫెక్ట్ గా న్యాయం చేసే రేంజులో ఉండడంతో సలార్ టీజర్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇకపై కల్కి అండ్ సలార్ మధ్య ప్రతి విషయంలో పోటీ ఉండే ఛాన్స్ ఉంది. ఈ పోటీలో కల్కి గెలుస్తాడా లేక సలార్ గెలుస్తాడా అనేది చూడాలి.