ఐపీఎస్ అధికారులు ఖాకీ దుస్తులు వదిలి పింక్ బట్టలు వేసుకున్నారని, పింక్ దుస్తుల్లో గుండాగిరి చేస్తున్నారని, బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ తరుణ్ చుగ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్ ప్రభుత్వం, అధికారులపై ఫైర్ అయ్యారు. బండి సంజయ్ అరెస్టు సందర్భంగా అనుచితంగా వ్యవహరించిన ఆ అధికారిపై సభా హక్కుల ఉల్లంఘన కేసు ఉందన్నారు. తెలంగాణలో కుటుంబ పాలన నడుస్తుందని ఎద్దేవా చేశారు. తెలంగాణ ఆందోళనలో పాల్గొన్న వాళ్లు ఈ రోజు మాతో ఉన్నారు.
Read Also:జగన్‌కు ఓటేసి ప్రజలు తప్పు చేశారు: అచ్చెన్నాయుడు
మీ దగ్గర తెలంగాణ ఉద్యమం లో లేని వారు ఉన్నారని ఆరోపించారు. బండి సంజయ్ పై తప్పుడు కేసు పెట్టారని రుజువు అయింది. తెలంగాణలో కలోనియల్ రూల్ నడుస్తుందన్నారు. దేశం న్యాయం, చట్టంతో నడుస్తుంది. ఎంతమందిని జైల్లో వేస్తావో వేయించు.. ఎంత రాజరికం చూపిస్తావో చూపెట్టు.. బంగారు తెలంగాణ కోసం బీజేపీ పోరాటం చేస్తూనే ఉంటుందని తరుణ్ చుగ్ టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి చురకలు అంటించారు.