జగన్‌కు ఓటేసి ప్రజలు తప్పు చేశారు: అచ్చెన్నాయుడు

టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్‌ఉ ఓటేసి ప్రజలు తప్పు చేశారన్నారు. ప్రజలకు జగన్ చరిత్ర తెలిసి మరీ ఓటేశారని ఫైర్ అయ్యారు. జైల్లో ఉండి వచ్చిన వ్యక్తికి ప్రజలు ఓట్లేయడమంటే ప్రజలు చేసిన తప్పు కాక మరేమిటీ.. ? అంటూ సీరియస్‌ అయ్యారు. చంద్రబాబుకంటే ఎక్కువగా ఏదో మంచి చేస్తారని ప్రజలు ఓట్లేశారని.. ఇచ్చిన హామీలన్నీ చేసేస్తాడేమో.. మనం ఏమైపోతాం అని.. రాజకీయంగా ఉండగలమా..? లేదా..? అని నేనూ భయపడ్డానని వెల్లడించారు. కానీ జగన్ ఏం చేయలేదు.. మాట తప్పారని.. టీడీపీని లేకుండా చేసేందుకు వైసీపీ చాలా ప్రయత్నాలు చేసి విఫలమయ్యారన్నారు.

Read Also:ప్రైవేటీకరణకు నిరసనగా ఆందోళనలు: భారతీయ మజ్దూర్‌ సంఘ్‌

టీడీపీ.. వైసీపీ తరహాలో గాలికి పుట్టి.. గాలికి పెరగలేదని.. దేవాలయం లాంటి పార్టీ కార్యాలయంపై దాడి చేయడానికి వైసీపీ నేతలకు సిగ్గు లేదా..? అని మండిపడ్డారు. టీడీపీ హయాంలో ప్రారంభించిన ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టులో ఏదో స్కామ్ జరిగిందని వెతికి వెతికి వేసారి పోయారని.. ఎంతో వెతికినా ఏం దొరకలేదని మండిపడ్డారు. సీమెన్స్ ప్రాజెక్టు వస్తే రాష్ట్రానికి తెచ్చామని.. రూ. 3300 కోట్లు అంచనాతో సీమెన్స్ ప్రాజెక్టు రాష్ట్రానికి తెచ్చామన్నారు. 90 శాతం ఖర్చు సీమెన్స్ కంపెనీది.. 10 శాతం ప్రభుత్వం ఖర్చు చేసేలా ఒప్పందం జరిగిందని తెలిపారు.

Related Articles

Latest Articles