ప్రస్తుత కాలంలో నగరాల్లో కార్పెరేట్ కంపెనీలు పెరగడంతో డే అండ్ నైట్ పనిచేసే వారి సంఖ్య కూడా పెరింగింది.

ఇతర ఉద్యోగులతో పోల్చినప్పుడు రాత్రిపూట విధులు నిర్వహించే ఉద్యోగులు త్వరగా అలసిపోతారు. 

పగటిపూట పనిచేసే ఉద్యోగులతో పోల్చితే నైట్ షిఫ్ట్ ఉద్యోగులకు పలు అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని పలు పరిశోధనల్లో తేలింది. 

నైట్ షిఫ్ట్ ఉద్యోగుల ప్రధాన సమస్య.. నిద్రలేమి. పడుకోగానే నిద్ర పట్టక పోవటం, పట్టినా వెంటనే మెళకువ రావటం ఉంటుంది.

నాలుగు గంటలైనా హాయిగా నిద్రపోలేక పోవటం వల్ల కార్యాలయంలో నిద్ర పోవటం, పనితీరు మందగించటం వంటి సమస్యలు వస్తాయి.

అదే విధంగా నైట్ షిఫ్ట్ ఉద్యోగాల కార‌ణంగా చాలా మంది సంతాన‌లేమి స‌మ‌స్య‌తో కూడా బాధ‌ప‌డుతున్నారు. 

రాత్రిపూట మేల్కొని పనిచేయడం వల్ల సహజ నిద్ర చక్రం దెబ్బతింటుంది, దీనివల్ల నిద్రలేమి, అలసట, ఏకాగ్రత లోపం వంటి సమస్యలు వస్తాయి.

జీవిత భాగస్వామితో లైంగికంగా కలవడానికి కూడా పెద్దగా ఆసక్తి చూపించకపోవడం ఈ నైట్ షిష్ట్ చేసే వారిలో అధికంగా కనిపిస్తోందని తాజాగా చేసిన అధ్యాయనంలో తేలింది. 

నైట్ షిఫ్ట్ పని మధుమేహం, గుండె జబ్బులు, కొన్ని రకాల క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది.

నైట్ షిఫ్ట్ పని అజీర్ణం, గుండెల్లో మంట, పొట్టలో పుండ్లు వంటి జీర్ణ సమస్యలకు దారితీస్తుంది.

నైట్ షిఫ్ట్ పని ఆందోళన, నిరాశ, మానసిక స్థితి మార్పుల ప్రమాదాన్ని పెంచుతుంది.